'చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి'...రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్స్

Live ap assembly election 2019 result: 1982 మార్చి 29న పుట్టిన టీడీపీ 2019 మే 23న మరణించిందని పేర్కొన్నారు రాంగోపాల్ వర్మ. అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, జగన్, లోకేశే టీడీపీ మరణానికి కారణమని వెల్లడించారు.

news18-telugu
Updated: May 23, 2019, 12:39 PM IST
'చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి'...రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్స్
చంద్రబాబు, రాంగోపాల్ వర్మ
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం దిశగా టీడీపీ పయనిస్తోంది. కనీసం 30 స్థానాల్లో కూడా ఆధిక్యంలో లేదు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీస్ ఎన్టీర్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. టీడీపీకి వ్యతరేకంగా ట్వీట్స్ పెడుతూ చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్‌కు అభినందలు చెబుతూనే చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఆర్జీవీ.
ఎన్టీఆర్‌కు తానే చేశాడో చంద్రబాబు గుర్తు తెచ్చుకుంటున్నాడని మరో ట్వీట్ చేశారు ఆర్జీవీ. అంతేకాదు 1982 మార్చి 29న పుట్టిన టీడీపీ 2019 మే 23న మరణించిందని పేర్కొన్నారు రాంగోపాల్ వర్మ. అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, జగన్, లోకేశే టీడీపీ మరణానికి కారణమని వెల్లడించారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన్ను వైసీపీ నేతలు సమర్థిస్తుండగా టీడీపీ శ్రేణులు మాత్రం మండిపడుతున్నాయి.
First published: May 23, 2019, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading