ఏపీలో రికార్డు విజయం దిశగా వైసీపీ దూసుకుపోతోంది. 150 సీట్లలో ఆధిక్యంతో ప్రభంజనం సృష్టిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేసే అవకాశముంది. రిజల్ట్ ట్రెండ్స్‌పై స్పందించిన వైఎస్ జగన్..ఈ విజయం తాము ఊహించినదేనని తెలిపారు. అఖండ విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు చెప్పిన ఏపీ కాబోయే సీఎం..రాహుల్ గాంధీ గురించి ఇప్పుడేం మాట్లాడనని స్పష్టంచేశారు. జాతీయ మీడియాతో మాట్లాడతూ ఈ వ్యాఖ్యలు చేశారు జగన్.
ఈ విజయం ఊహించినదే. ప్రత్యేక హోదానే మా అజెండా. అఖండ విజయం సాధించిన మోదీకి శుభాంక్షలు. ప్రజలు, దేవుడు వైసీని ఆశీర్వదించారు. రాహుల్ గురించి ఇప్పుడేం మాట్లడను.
— వైఎస్ జగన్
ఏపీలో 16 నెలల పాటు 3,500 కిలోమీటర్ల మేర సాగిన ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజల నుంచి తనకు విశేష మద్దతు లభించిందని జగన్ పేర్కొన్నారు. పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఆ మహాయాత్ర వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషిచిందని చెప్పారు. కాగా, వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 25న జరగనుంది. ఆ సమావేశంలో జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు వైసీపీ నేతలు. అనంతరం మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.