• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • LISTED IN RAJGARH ROLLS BHOPAL CONGRESS CANDIDATE DIGVIJAYA SINGH MISSES OUT ON VOTING MS

ఓటు వేయని డిగ్గీ రాజా : అందరినీ ఓటు వేయమని.. తాను మాత్రం..

ఓటు వేయని డిగ్గీ రాజా : అందరినీ ఓటు వేయమని.. తాను మాత్రం..

దిగ్విజయ్ సింగ్ ఫైల్ ఫోటో (Photo Credits - Getty Images)

రోజంతా భోపాల్‌లోని పోలింగ్ బూత్‌ల చుట్టూ తిరగడానికే సరిపోవడంతో.. దిగ్విజయ్ రాజ్‌ఘర్ చేరుకోలేకపోయారని ANI వెల్లడించింది.

  • Share this:
    మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. స్వగ్రామం రాజ్‌ఘర్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. సకాలంలో అక్కడికి చేరుకోలేకపోవడం వల్ల ఓటు వేయలేకపోయానని తెలిపారు. ఓటు వేయకపోవడం పట్ల విచారంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తానని తెలిపారు.

    రోజంతా భోపాల్‌లోని పోలింగ్ బూత్‌ల చుట్టూ తిరగడానికే సరిపోవడంతో.. దిగ్విజయ్ రాజ్‌ఘర్ చేరుకోలేకపోయారని ANI వెల్లడించింది. భోపాల్ నుంచి రాజ్‌ఘర్ 130కి.మీ దూరంలో ఉంది. అయితే ఓటింగ్ సరళిని గమనిస్తూ దిగ్విజయ్ అక్కడే బిజీ బిజీగా గడపడంతో రాజ్‌ఘర్ వెళ్లలేకపోయారు. అంతకుముందు పెద్ద ఎత్తున ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనాలని దిగ్విజయ్ పిలుపునిచ్చారు. అందరూ ఓటేయాలని చెప్పి తాను మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు.
    First published:

    అగ్ర కథనాలు