ఆ విషయంలో ఏపీని చూసి నేర్చుకోండి.. కేసీఆర్‌కు కాంగ్రెస్ సలహా

మద్యం వల్లే రాష్ట్రంలో నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆబ్కారీ శాఖను మద్యం ప్రోత్సాహక శాఖగా మారిస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: December 17, 2019, 5:40 PM IST
ఆ విషయంలో ఏపీని చూసి నేర్చుకోండి.. కేసీఆర్‌కు కాంగ్రెస్ సలహా
సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణలో దిశా హత్యాచార ఘటన తర్వాత మద్యపానానికి వ్యతిరేకంగా విపక్షాలు గళమొత్తాయి. ఇప్పటికే బీజేపీ నేత డీకే అరుణ ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల పాటు దీక్ష చేశారు. తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలని ఆ దీక్షలో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తాజాగా ఇదే డిమాండ్‌ను కాంగ్రెస్ వినిపిస్తోంది. మద్యం వల్లే రాష్ట్రంలో నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆబ్కారీ శాఖను మద్యం ప్రోత్సాహక శాఖగా మారిస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.

మంగళవారం గాంధీభవన్‌‌లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి.. ''సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఏపీలో మద్యం ధరలను పెంచారని ఇక్కడ కూడా మద్యం ధరలను పెంచారు. మరి ఏపీలో మద్యం దుకాణాలను తగ్గించినప్పుడు.. ఆ పనిని ఇక్కడ ఎందుకు చేయడం లేదు? రాష్ట్రంలో నేరాల పెరుగుదలకు మద్యమే కారణం. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని చెబుతున్న కేసీఆర్.. మద్యం ధరలను పెంచి ఆదాయం సమకూర్చుకోవడం విడ్డూరం. మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం దురదృష్టకరం'' అని విమర్శించారు.

Telangana, telangana news, congress, t jeevan reddy, cm kcr, ktr, telangana legislative council, telangana assembly, తెలంగాణ తెలంగాణ వార్తలు, కాంగ్రెస్, టి జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ శాసనమండలి, తెలంగాణ అసెంబ్లీ
కేసీఆర్, జీవన్ రెడ్డి


Published by: Shiva Kumar Addula
First published: December 17, 2019, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading