వైన్ షాప్ వ్యాపారుల నయా దందా..

వైన్స్ షాపుల యజమానులు అండదండలతో గ్రామాల్లో గల్లీ గల్లీలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎంఆర్పీపై రూ.10 అదనంగా ఇస్తే ఏ అధికారి మీ జోలికి రారు అని భరోసాతో ఆటోల్లో మద్యాన్ని బెల్టుషాపుల కి తరలిస్తున్నారు.

news18-telugu
Updated: October 4, 2019, 10:42 PM IST
వైన్ షాప్ వ్యాపారుల నయా దందా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైన్స్ షాప్ లో దొరకని మద్యం బెల్ట్ షాప్ లో దొరుకుతోంది. ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో. ఏ అధికారి వచ్చినా తాము చూసుకుంటామని, ఎంఆర్పీపై రూ.10 ఇస్తే చాలు అంటూ ఏకంగా వైన్ షాపు వ్యాపారులే ఈ దందా నడిపిస్తున్నారు. అధికారుల చొరవతోనే ఇదంతా చేస్తున్నామని చెప్పడం మరింత విడ్డూరం. ఖమ్మం జిల్లా పరిధిలో వైన్స్ షాప్ లలో దొరకనిది బెల్ట్ షాప్ లలో దొరుకుతుంది. ఇలా జిల్లాలో మూడు పూలు ఆరు కాయలు లాగా బెల్టుషాపుల వ్యాపారం జరుగుతుంది. మామూళ్ల మత్తులో అధికారులు ఉండగా స్థానికులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం హైవే లకు దూరంగా వైన్ షాపులు ఉంచగా బెల్టుషాపులు మాత్రం హైవే పక్కనే నిర్వహిస్తున్నారు. వైన్స్ షాపుల యజమానులు అండదండలతో గ్రామాల్లో గల్లీ గల్లీలో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎంఆర్పీపై రూ.10 అదనంగా ఇస్తే ఏ అధికారి మీ జోలికి రారు అని భరోసాతో ఆటోల్లో మద్యాన్ని బెల్టుషాపుల కి తరలిస్తున్నారు. ప్రస్తుతం వైన్స్ షాపుల టెండర్ గడువు పెంచడంతో అధిక స్థాయిలో మద్యాన్ని బెల్టు షాపులకు విక్రయిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండని వారు కూడా మద్యానికి బానిస అవుతున్నారు అంటూ బెల్టుషాపులు బారినుండి వాళ్ల పిల్లల్ని రక్షించుకోవడం కోసం బెల్టుషాపులు ధ్వంసం చేసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.

(శ్రీనివాస్, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>