ఐసిస్ లాగే ఆర్ఎస్ఎస్.. కమల్ వ్యాఖ్యలు సరైనవే : కాంగ్రెస్ నేత సంచలనం

స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అన్న మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యలను తాను 100శాతం కాదు, 1000శాతం సమర్థిస్తానని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ ఆళగిరి అన్నారు.

news18-telugu
Updated: May 13, 2019, 6:15 PM IST
ఐసిస్ లాగే ఆర్ఎస్ఎస్.. కమల్ వ్యాఖ్యలు సరైనవే : కాంగ్రెస్ నేత సంచలనం
కమల్ హాసన్, కేఎస్ ఆళగిరి (File)
  • Share this:
తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ ఆళగిరి బీజేపీ మాత‌ృ సంస్థ ఆర్ఎస్ఎస్‌ను ఐసిస్‌తో పోల్చారు. ఇస్లాం పేరు చెప్పుకుని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా ఎలాగైతే తీవ్రవాద సంస్థగా మారిందో.. హిందూయిజం పేరుతో ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రవాద సంస్థగా మారిందన్నారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, హిందూ మహాసభ వంటి సంస్థలు తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని అంతమొందించాలని చూస్తాయన్నారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది హిందువే అన్న మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ వ్యాఖ్యలను తాను 100శాతం కాదు, 1000శాతం సమర్థిస్తానని అన్నారు.

అరబ్ దేశాల్లో ఐసిస్ లాగే ఇక్కడ ఆర్ఎస్ఎస్ తయారైంది. తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారు ముస్లింలు అయినా సరే ఐసిస్ వారిని అంతమొందించాలనుకుంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా అలాగే ఆలోచిస్తుంది. అతివాద వామపక్ష వాదులు, అతివాద రైటిస్టులు ఇదే పంథాను అనుసరిస్తారు.
కేఎస్ ఆళగిరి, తమిళనాడు కాంగ్రెస్ చీఫ్


అంతకుముందు తమిళనాడులోని అరవకురిచిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అన్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత హిందు ఉగ్రవాది అని పేర్కొన్నారు. కమల్ ప్రచారం చేసిన ఆ నియోజకవర్గంలో ముస్లింల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు కమల్ మాత్రం ఓట్ల కోసం తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఉన్న వాస్తవాన్ని చెప్పానని అంతకుముందు ప్రచార ర్యాలీలో వ్యాఖ్యానించారు.

First published: May 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>