టీం లోకేష్ నుంచి ప్రాణహాని.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

సోషల్ మీడియా వేదికగా టీం-లోకేష్ అనే గ్రూపులో నాని చౌదరి అనే టీడీపీకి చెందిన అతను పోస్టులు పెట్టాడని ఆర్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

news18-telugu
Updated: August 18, 2019, 2:38 PM IST
టీం లోకేష్ నుంచి ప్రాణహాని.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
నారా లోకేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి(Images: Facebook)
  • Share this:
టీం-లోకేష్ , చెన్నై టీడీపీ ఫోరం ,మరియు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనమీద సీఎం జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా టీం-లోకేష్ అనే గ్రూపులో నాని చౌదరి అనే టీడీపీకి చెందిన అతను పోస్టులు పెట్టాడని ఆర్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తరిమి తరిమి కొడతానని బెదిరిస్తున్నారని, ‘మీ నాయకుడు జగన్ జైలుకు పోవటం ఖాయమని’ బెదిరిస్తున్నారని, అసభ్యపదాజాలంతో పోస్టులు పెడుతున్నారంటూ ఆర్కే పోలీసులకు తెలిపారు.

ఇటీవల కృష్ణా నదికి వరదలు రావడంతో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు నీరు చేరాయి. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా పరస్పర విమర్శలు చేసుకున్నారు. దీంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ తరఫున ఆర్కే పోటీ చేశారు. టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేశారు. లోకేష్ మీద ఆర్కే విజయం సాధించారు.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు