తప్పుదోవ పట్టిస్తున్న సోషల్ మీడియా.. బ్యాలెట్ బాక్సుల్లో బీరు కావాలన్న లేఖలు రానేలేదు..

సార్.. కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు లేఖ రాశాడు. ఆ బీర్ల కోసం తమ జగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయాలని కోరాడు.

news18-telugu
Updated: July 17, 2019, 3:26 PM IST
తప్పుదోవ పట్టిస్తున్న సోషల్ మీడియా.. బ్యాలెట్ బాక్సుల్లో బీరు కావాలన్న లేఖలు రానేలేదు..
బ్యాలెట్ బాక్సుల్లో బయటపడ్డ లెటర్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులు
  • Share this:
సోషల్ మీడియా వల్ల ఎంత లాభమో.. అంతకుమించి నష్టం కూడా. మనకు అవసరం ఉండి, అవి సరైనవని నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేస్తే మంచిది. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయన్న ఘటనలు వెలుగు చూశాయి. బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయని, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అందులో ‘సార్.. కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదు’ అని ఓ యువకుడు రాసిన లేఖ కూడా ఉందని వైరల్ అయ్యిందో ఫోటో.

అయితే, అదంతా అబద్ధం. అసలు అందుకు సంబంధించిన ఏ లెటర్ కూడా బ్యాలెట్ బాక్సుల్లో వేయలేదని జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు కూడా. అయితే, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల రోజు చాలా పత్రికలు, వెబ్‌సైట్లు.. బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు వచ్చాయంటూ తెలిపిన విషయం తెలిసిందే. నిజ నిర్ధారణలో భాగంగా ఆ లేఖలు బ్యాలెట్ బాక్సులో రాలేదని తేలింది.

బ్యాలెట్ బాక్సుల్లో ప్రత్యక్షమయ్యాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు..

బీరు కావాలంటూ రాసినట్లు ఉన్న లేఖ
రోడ్లు వేయాలని కోరుతూ రాసిన లేఖ


 
First published: June 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు