నన్ను చూసి నేర్చుకోండి.. పారిశ్రామిక వేత్తలకు మంత్రి సూచన...

వ్యాపారంలో విజయవంతం కావాలంటే పారిశ్రామికవేత్తలు తనను చూసి నేర్చుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు.

news18-telugu
Updated: December 5, 2019, 6:19 PM IST
నన్ను చూసి నేర్చుకోండి.. పారిశ్రామిక వేత్తలకు మంత్రి సూచన...
మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
మంత్రి మల్లారెడ్డి అంటే ఫైర్ బ్రాండ్. అప్పుడప్పుడు కొన్ని సంచలన, ఆసక్తికర విషయాలతో ప్రజల్లో నానుతూ ఉంటారు. అయితే, తాజాగా ఆయన తన గురించి తానే గొప్పగా చెప్పుకొన్నారు. టీఎస్ ఐపాస్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా పారిశ్రామికవేత్తలతో తెలంగాణ ప్రభుత్వం ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్, కార్మిక - ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి పారిశ్రామికవేత్తలకు చేసిన సూచన వారిలో చర్చనీయాంశంగా మారింది.

‘ఒకప్పుడు సైకిల్ మీద రెండు పాల క్యాన్లు తీసుకెళ్లి అమ్మేవాడిని. ఇప్పుడు నేనో విజయవంతమైన పారిశ్రామికవేత్తని. నాకు 13 ఇంజినీరింగ్, రెండు మెడికల్, రెండు డెంటల్ కాలేజీలు ఉన్నాయి. 10 సీబీఎస్‌ఈ స్కూళ్లు ఉన్నాయి. 10వేల మంది టీచర్లకు ఉపాధి కల్పిస్తున్నా. నేను డాక్టర్, ఇంజినీరింగ్ చదవకపోయినా ఇన్ని కాలేజీలు పెట్టా. పారిశ్రామికవేత్తగా ఎలా ఎదగాలో నన్ను చూసి నేర్చుకోండి’ అని సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు ఆయన సూచించారు. కేటీఆర్ లాంటి స్మార్ట్, డైనమిక్ మంత్రి దేశంలో ఎక్కడా లేరని, ఆయన ఉండడం తెలంగాణకు అదృష్టమని మల్లారెడ్డి అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2019, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading