వైసీపీలోకి నేతల ఓవర్ ఫ్లో.. జగన్‌కి లాభిస్తుందా? చేటు చేస్తుందా?

కీలక సమయంలో పార్టీని నమ్మకున్న నేతలను కాదని గెలుపు గుర్రాల పేరిట ఫిరాయింపు దారుల్ని, కొత్త నేతలను వైసీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: March 14, 2019, 8:45 PM IST
వైసీపీలోకి నేతల ఓవర్ ఫ్లో.. జగన్‌కి లాభిస్తుందా? చేటు చేస్తుందా?
వైసీపీలో చేరిన నేతలు
  • Share this:
(సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్‌18)

ఎన్నికల వేళ ఏపీ వైసీపీలో కొనసాగుతున్న వలసల పర్వం ఆ పార్టీకి చేటు తెస్తుందా? వరుసగా వలస నేతలను ప్రోత్సహించడంతో పార్టీని నమ్ముకున్న వారిలో అసంతృప్తి మొదలైందా? తమను కాదని కొత్తగా పార్టీలోకి చేరుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం సిట్టింగ్ ఎమ్మెల్యేలలోనూ ఆగ్రహానికి కారణమవుతోంది. వలస నేతలకు న్యాయం చేసే క్రమంలో తనను నమ్ముకున్న వారిని జగన్ దూరం చేసుకుంటారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలసల పర్వం కొనసాగుతోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేకుండా తమకు అనుకూలంగా ఉండే చోటుకు నేతలు వాలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎవరు వస్తారన్నది ఇంతా స్పష్టత రాకపోయినా తమ సర్వేలు, అంచనాల ఆధారంగా ఎంచక్కా ప్లేటు ఫిరాయిస్తున్నారు. గతంలో పార్టీల మార్పుపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగినా ఎన్నికల సమయం కావడంతో ఇదంతా సర్వసాధారణమే అన్నట్లుగా పార్టీలు కూడా లైట్ తీసుకుంటున్నాయి.

ysrcp joining,ysrcp new joinings,ganta on joining ysrcp,leaders joining in ysrcp,ysrcp leaders joining tdp,comedian ali joins in ysrcp,ali speech joining in ysrcp,ysrcp latest news,ap politics,comedian ali,ysrcp family batch joining tdp?,ysrcp news,media fires on pvp joining in ysrcp,telugu film stars joining in ysrcp,ali joins ysrcp,tollywood stars joining into ysrcp,joining in ycp, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీలో చేరికలు, వైసీపీలోకి నేతలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, వైసీపీలో నేతల చేరికల తలనొప్పి
వైసీపీలో చేరిన ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు(File)

ఈసారి ఏపీలో అధికార టీడీపీతో పోలిస్తే విపక్ష వైసీపీలోకి ఎక్కువగా వలసలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి చేరిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్ధితి. అయితే వైసీపీలోకి టీడీపీ, కాంగ్రెస్, జనసేన వంటి పార్టీల నుంచి వస్తున్న నేతలతో బయటకు అంతా పాజిటివ్ గా ఉందన్నట్లుగా కనిపిస్తుండగా... అంతర్గతంగా మాత్రం అసంతృప్తి సెగలు రేగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో పలుచోట్ల అసంతప్తులను జగన్ తో పాటు వైసీపీ కీలక నేతలు బుజ్జగిస్తుండగా.. మరికొన్ని చోట్ల అలకలతో వైసీపీ నుంచి టీడీపీలోకి రివర్స్ ఫిరాయింపులు మొదలయ్యాయి. ఎన్నికల నాటికి ఈ ప్రభావం మరింత పెరగవచ్చేనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ysrcp joining,ysrcp new joinings,ganta on joining ysrcp,leaders joining in ysrcp,ysrcp leaders joining tdp,comedian ali joins in ysrcp,ali speech joining in ysrcp,ysrcp latest news,ap politics,comedian ali,ysrcp family batch joining tdp?,ysrcp news,media fires on pvp joining in ysrcp,telugu film stars joining in ysrcp,ali joins ysrcp,tollywood stars joining into ysrcp,joining in ycp, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీలో చేరికలు, వైసీపీలోకి నేతలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, వైసీపీలో నేతల చేరికల తలనొప్పి
వైసీపీలో చేరిన తోట నరసింహం దంపతులు

ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరడంతో అక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న ఎడం బాలాజీ టీడీపీలో చేరిపోయారు. మార్కాపురంలో కేపీ కొండారెడ్డి కుటుంబం రాకతో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పక్కచూపులు చూస్తున్నారు. ఇదే జిల్లాలో దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి రావడంతో అక్కడ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. కర్నూలు జిల్లాలో కాటసాని రాం భూపాల్ రెడ్డి రాకతో పాణ్యంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు. కృష్ణాజిల్లాలో మల్లాది విష్ణు రాకతో సెంట్రల్ సీటు తనకు రాదని తెలిసి వంగవీటి రాధా టీడీపీకి ఫిరాయించి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కిల్లి కృపారాణి వైసీపీలోకి రావడంతో అక్కడ తమ ప్రాభవానికి ఎక్కడ గండిపడుతుందో అని ధర్మాన కుటుంబం ఆందోళనలో ఉంది. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్ధితే ఉంది.

ysrcp joining,ysrcp new joinings,ganta on joining ysrcp,leaders joining in ysrcp,ysrcp leaders joining tdp,comedian ali joins in ysrcp,ali speech joining in ysrcp,ysrcp latest news,ap politics,comedian ali,ysrcp family batch joining tdp?,ysrcp news,media fires on pvp joining in ysrcp,telugu film stars joining in ysrcp,ali joins ysrcp,tollywood stars joining into ysrcp,joining in ycp, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీలో చేరికలు, వైసీపీలోకి నేతలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, వైసీపీలో నేతల చేరికల తలనొప్పి
వైఎస్ జగన్, అలీ
కీలక సమయంలో పార్టీని నమ్మకున్న నేతలను కాదని గెలుపు గుర్రాల పేరిట ఫిరాయింపు దారుల్ని, కొత్త నేతలను వైసీపీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది పలుచోట్ల నేతలు పార్టీ వీడే వరకూ వెళ్లడం వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశమే. అయినా అధినేత జగన్ మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోనట్లే కనిపిస్తోంది.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading