Home /News /politics /

LB NAGAR MLA DEVIREDDY SUDHEER REDDY APPOINTED AS MUSI RIVER FRONT DEVELOPMENT CHAIRMAN BA

పార్టీ మారిన ఎమ్మెల్యేకు కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్...

సీఎం కేసీఆర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

సీఎం కేసీఆర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కేబినెట్ హోదా కలిగిన పదవిని ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్ రెడ్డి మూడేళ్లు కొనసాగుతారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ మీద 17848 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయింది. దీంతో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

    హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్


    1986లో తొలిసారి మలక్‌పేట నుంచి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు సుధీర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఏర్పడిన ఎల్బీనగర్ సీటు నుంచి 2009లో పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అంత్యంత సన్నిహితుల్లో ఒకడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంటే ఉన్నారు. దీంతో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2008 మధ్య హుడా చైర్మన్‌గా పనిచేశారు. అలాగే, దేశంలోనే అతి పెద్దదైన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే (11.6 కిలోమీటర్లు) ప్లానింగ్, అమలు, పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్లానింగ్, అమల్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది.

    రామ్మోహన్ గౌడ్, సుధీర్ రెడ్డి


    హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ఉత్పత్తి అవుతున్న చెత్తను తీసుకుని వెళ్లి శివారులోని ఆటోనగర్‌ డంప్ యార్డులో వేయడాన్ని నిరసిస్తూ 2003లో సుధీర్ రెడ్డి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీని వల్ల సుమారు లక్ష మంది ఇబ్బందిపడుతున్నారంటూ ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీధర్ రెడ్డి హుడా చైర్మన్ అయిన తర్వాత ఆ డంప్ యార్డును తరలించేందుకు ఆదేశాలు ఇచ్చారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి


    పర్యావరణ పరిరక్షణ, చెరువల సంరక్షణ, మురుగునీటి పారుదల వంటి అంశాల మీద సుధీర్ రెడ్డి గతంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. జూబ్లిహిల్స్, మాదాపూర్ నుంచి కొన్ని సంవత్సరాల పాటు వెల్లువెత్తిన మురుగు వల్ల దుర్గం చెరువు కలుషితం అయిపోయిందని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11 మండలాల్లో ఉన్న 109 గ్రామాల్లో చెట్టు నాటే ఉద్యమాన్ని కూడా లేవనెత్తారు. అప్పట్లో రికార్డు సమయంలో సుమారు 2లక్షల మొక్కలను నాటారు.

    ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి


    మూసీనదిని ప్రక్షాళన చేసి దాన్ని సుందరంగా మార్చాలని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఇప్పటికే భారీ ఎత్తున కలుషితంగా మారిన దీన్ని క్లీన్ చేయాలంటే భారీ ఎత్తున నిధులు ఖర్చవుతాయి. దీంతోపాటు సమయం కూడా అవసరం అవుతోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Telangana, Trs

    తదుపరి వార్తలు