LAWYER FILED A CASE ON EX MP LAGADAPATI RAJAGOPAL SB
Lagadapati Survey: చిక్కుల్లో లగడపాటి... కొవ్వూరులో కేసు నమోదు
లగడపాటి రాజగోపాల్ (File)
Lagadapati Survey: లగడపాటి రాజగోపాల్ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని అడ్వకేట్ మురళీ కృష్ణ పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే పై కొవ్వూరుకు చెందిన అడ్వకేట్ మురళీ కృష్ణ ఫిర్యాదు చేశారు. లగడపాటి కారణంగా చాలామంది నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని సర్వే చేసి చెప్పిన లగడపాటి వలన అనేక మంది బెట్టింగులు కట్టి నష్టపోయారన్నారు. ఈ తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో విచారణ జరిపి తేల్చాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లగడపాటి వెనుక అంతర్జాతీయ బెట్టింగ్ మాఫియా అండదండలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు అడ్వకేట్ మురళీ కృష్ణ.
ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను ప్రకటించారు. టీడీపీయే అధికారం చేపడుతుందంటూ... ఆయన జోస్యం చెప్పారు. అయితే ఫలితాల్లో టీడీపీ అడ్రాస్ లేకుండా పోయింది. లగడపాటి సర్వే శుద్ధ తప్పని తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన లగడపాటి... ఏపీ ఎన్నికల్లో కూడా బక్క బోర్లా పడ్డారు. దీంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. లగడపాటిని నమ్మి కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టినవారంతో తీవ్రంగా నష్టపోయారంటూ లాయర్ మురళీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు సర్వేలతో జనాన్ని మోసం చేస్తున్న లగడపాటిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.