చంద్రగిరిలో లాఠీచార్జ్.. చెవిరెడ్డి అరెస్ట్

కమ్మపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 9:16 PM IST
చంద్రగిరిలో లాఠీచార్జ్.. చెవిరెడ్డి అరెస్ట్
చెవిరెడ్డి భాస్కర రెడ్డి
  • Share this:
చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రచ్చ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఎన్.ఆర్ కమ్మపల్లిలోకి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రానివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. నిన్న రాత్రి మొదలైన గొడవ ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగింది. ఓవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు టీడీపీ కార్యకర్తలు మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, బూత్ నెంబర్ 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో రీ పోలింగ్ జరగనుంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>