సీఎం జగన్ నిర్ణయం కోసం లక్ష్మీపార్వతి వెయిటింగ్ ?

మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన రోజాకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. దీంతో లక్ష్మీపార్వతికి జగన్ ఏ పోస్టు ఇస్తారా అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.

news18-telugu
Updated: August 15, 2019, 1:29 PM IST
సీఎం జగన్ నిర్ణయం కోసం లక్ష్మీపార్వతి వెయిటింగ్ ?
సీఎం జగన్, లక్ష్మీపార్వతి
  • Share this:
వైసీపీలో ఉంటూ టీడీపీని విమర్శించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా నాయకుల్లో దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఒకరు. ఎన్నో ఏళ్ల నుంచి వైసీపీలో ఉన్న లక్ష్మీపార్వతికి సీఎం జగన్ మంచి పదవి ఇస్తారనే గతంలో వార్తలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవులు దక్కించుకోలేకపోయిన లక్ష్మీపార్వతికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కచ్చితంగా మంచి పదవి వస్తుందని ఆ పార్టీలో ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం రాని నేతలకు ఇతర కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఇస్తున్న సీఎం జగన్... పార్టీ సీనియర్ మహిళా నేత వాసిరెడ్డికి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు.

మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన రోజాకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పోస్టు ఇచ్చారు. దీంతో లక్ష్మీపార్వతికి జగన్ ఏ పోస్టు ఇస్తారా అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. నిజానికి ఏపీలో కీలకమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ పోస్టుకు వాసిరెడ్డి పద్మతో పాటు లక్ష్మీపార్వతి పేరును కూడా జగన్ పరిశీలించారని సమాచారం. అయితే పార్టీలోని లక్ష్మీపార్వతి కంటే సీనియర్ కావడం వల్లే ముందుగా వాసిరెడ్డికి జగన్ ప్రయారిటీ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు త్వరలోనే మరికొన్ని కీలకమైన నామినేటెడ్ పోస్టు భర్తీ ఉంటుందని... అందులో లక్ష్మీపార్వతికి కచ్చితంగా జగన్ ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ తరపున టీడీపీని, ఆ పార్టీ అధినేత అధినేత చంద్రబాబును విమర్శించే విషయంలో అందరికంటే దూకుడుగా వ్యవహరించిన లక్ష్మీపార్వతికి సీఎం జగన్ ఎప్పుడు కరుణిస్తారో చూడాలి.


First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు