జగన్‌పై మహిళా నేత అసంతృప్తి... కారణం ఇదే ?

రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లకు కీలకమైన పదవులు ఇచ్చిన సీఎం జగన్... వైసీపీ కోసం కష్టపడిన తనను విస్మరిస్తున్నారనే భావనలో లక్ష్మీపార్వతి ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 20, 2019, 12:02 PM IST
జగన్‌పై మహిళా నేత అసంతృప్తి... కారణం ఇదే ?
సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఎన్నికలకు ముందు తన పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పని చేసిన వారందరికీ ఏదో రకమైన కీలక పదవులు ఇస్తున్నారు ఏపీ సీఎం జగన్. మెల్లిగా ఒక్కొక్కరికి పదవులు కట్టబెడుతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినవారికి కాకుండా... కష్టకాలంలో తన పార్టీలో ఉన్న నేతలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ ఉంది. అయితే వైసీపీలో అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించడంలో మిగతా నాయకులకు ఏ మాత్రం తీసిపోకుండా ముందుకు సాగిన ఎన్టీఆర్ భార్య, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిని మాత్రం సీఎం జగన్ అంతగా పట్టించుకోవడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఎం జగన్‌కు మద్దతుగా చంద్రబాబును టార్గెట్ చేయడంలో ముందుండే లక్ష్మీపార్వతి ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయంగా ఆమె సైలెంట్ అయిపోవడం వెనుక కారణం ఏంటనే అంశం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోడెల ఆత్మహత్య వ్యవహారంలో మిగతా నేతలంతా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నా... ఈ విషయంలో లక్ష్మీపార్వతి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే లక్ష్మీపార్వతి వైసీపీలో సైలెంట్ అయిపోవడానికి అసలు కారణం జగన్‌ తీరుపై ఉన్న అసంతృప్తే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.

Ap news, ap politics, lakshmi Parvathi, cm ys jagan, ycp, roja, vasireddy Padma, kodela suicide, chandrababu naidu, tdp, bjp, లక్ష్మీపార్వతి, సీఎం వైఎస్ జగన్, వైసీపీ, రోజా, కోడెల ఆత్మహత్య, చంద్రబాబు
వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి


రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లకు కీలకమైన పదవులు ఇచ్చిన సీఎం జగన్... వైసీపీ కోసం కష్టపడిన తనను విస్మరిస్తున్నారనే భావనలో లక్ష్మీపార్వతి ఉన్నట్టు గుసగుసలు జోరందుకున్నాయి. ఈ కారణంగానే కొంతకాలంగా వైసీపీ తరపున లక్ష్మీపార్వతి పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో మౌనంగా ఉంటున్న లక్ష్మీపార్వతి ఎప్పుడు మళ్లీ తన వాయిస్ వినిపిస్తారన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading