Pattabhi House: టీడీపీ నేత పట్టాభి ఇంటి దగ్గర భారీగా పోలీసులు.. ఏం జరుగుతోంది ?

పట్టాభి ఇంటి దగ్గర పోలీసులు

Pattabhi House: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

  • Share this:
    ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఆ తరువాత వైసీపీ శ్రేణులు ఆయన ఇల్లు, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే... మరోవైపు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి(Pattabhi)ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సీఎం జగన్‌(CM YS Jagan Mohan Reddy)ను పట్టాభి దూషించారంటూ కేసులు నమోదు చేసి ఉంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

    మరోవైపు పట్టాభి వ్యాఖ్యలపై పోలీసులు కూడా సీరియస్‌గా దృష్టి పెట్టారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం నేరమని పోలీసులు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్‌పై పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని అధికార వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడతారా ? అనే చర్చ జరుగుతోంది.

    పట్టాభి ఇంటి దగ్గరకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. ఆయనను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు సైతం పట్టాభి ఇంటి దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. పోలీసులు కేవలం పట్టాభి చేసిన వ్యాఖ్యలకుగానూ ప్రస్తుతం ఆయనకు నోటీసులు ఇచ్చి వెళతారా ? లేక ఆయనను అదుపులోకి తీసుకుంటారా ? అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

    Andhra Pradesh, Andhra Pradesh news, Tirupathi news, Andhra Municipal Elections, Tirupathi Municipal Corporation, Telugu Desham Party, TDP, Pattabhiram, YSRCP, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, తిరుపతి న్యూస్, తిరుపతి మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి మున్సిపల్ కార్పొరేష్, తెలుగుదేశం పార్టీ, టీడీపీ, పట్టాభిరామ్, వైఎస్ఆర్సీపీ
    టీడీపీ నేత పట్టాభిరామ్ (ఫైల్)


    నిన్న మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటి తరువాత ఆయన ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఫర్నీచర్, వాహనాలను ధ్వంసం చేశాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పలువురిపై దాడి చేశారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.

    Revanth Reddy: ఆ సీనియర్ నేతతో టీఆర్ఎస్, బీజేపీలకు చెక్.. రేవంత్ రెడ్డి ప్లాన్ ?

    Avoid Diabetes: డయాబెటిస్ రావొద్దని కోరుకుంటున్నారా ? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..

    వైసీపీ తీరుపై మండిపడ్డ చంద్రబాబు (Chandrababu Naidu) నేడు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చారు. 36 గంటలు నిరసన దీక్ష చేపడతానని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: