దేశ చరిత్రలో ఇదో మైలు రాయి.. పౌరసత్వ సవరణ బిల్లుపై మోదీ..

పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని, దేశ సౌభ్రాతృత్వానికి దోహదపడుతుందని అన్నారు.

news18-telugu
Updated: December 11, 2019, 10:02 PM IST
దేశ చరిత్రలో ఇదో మైలు రాయి.. పౌరసత్వ సవరణ బిల్లుపై మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
  • Share this:
పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని, దేశ సౌభ్రాతృత్వానికి దోహదపడుతుందని అన్నారు. ఏళ్లుగా వివక్షను,హింసను ఎదుర్కొంటున్నవారికి ఇదో గొప్ప ఉపశమనంగా ఉంటుందన్నారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 125 మంది,వ్యతిరేకంగా 105మంది ఓటేశారు.

ఉభయ సభల్లో బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి రాష్ట్రపతి సంతకం కోసం బిల్లును పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లు అమలులోకి వస్తుంది. ఇదిలా ఉంటే,బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే.
పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చినవారికి పౌరసత్వం కల్పించడం ద్వారా తమ అస్తిత్వానికి సమస్య తలెత్తుతుందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్లును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు.
First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు