అత్తవారింటిపై ఐశ్వర్యరాయ్ సంచలన వ్యాఖ్యలు

తన భర్త, మరిది వలన తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని... కానీ ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదైందని ఐశ్వర్య ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: September 30, 2019, 12:23 PM IST
అత్తవారింటిపై ఐశ్వర్యరాయ్ సంచలన వ్యాఖ్యలు
లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యరాయ్
  • Share this:
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. లాలూ పెద్ద కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్య రాయ్ సంచలన ఆరోపణలు చేశారు.  అత్తింటి వేధింపులపై ఆమె గళం విప్పారు. మూడు నెలలుగా తనకు తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య కీలక ఆరోపణలు  చేశారు. అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతిపై విమర్శలు చేశారు. తనను వంటింట్లోకి కూడా రానివ్వలేదన్నారు.

తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్


ఇప్పటికే భార్యతో విడాకులు కోరుతూ ఆరు నెలల క్రితం తేజ్ ప్రతాప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తమ కాపురం నిలబడుతుందనే ఆశతో ఐశ్వర్యారాయ్ తన అత్తతోనే కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి అత్తింటివారిపై తీవ్ర విమర్శల దాడి చేసింది. అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వంటగదికి తాళాలు వేసి తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఐశ్వర్య రాయ్ ఆరోపించారు.

ఆడపడుచు మీసా భారతి, అత్త రబ్రీదేవీ




ఈ సంఘటనలన్నింటిని వీడియో తీస్తుంటే రబ్రీదేవి బాడీ గార్డ్ వచ్చి తన ఫోన్ లాక్కున్నారని చెప్పింది.  తన భర్త, మరిది వలన తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని... కానీ ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదైందని ఐశ్వర్య ఆరోపణలు చేశారు. మూడు నెలలుగా పుట్టింటివారు పంపుతున్న ఆహారంతోనే కడుపునింపుకుంటున్నానన్నారు. తన తండ్రి చంద్రికా రాయ్ తో కలసి లాలూ అవుట్ హౌస్ లో ఐశ్వర్య ధర్నాకు దిగారు.
First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...