శివుడి గెటప్‌లో లాలూ కొడుకు... గుడిలో పూజలు

ఎప్పుడూ ఏదో ఒక గెటప్ తో దేశ ప్రజలను ఆకర్షించే తేజ్ ప్రతాప్... శివుడి గెటప్‌లో పూజలు నిర్వహించాడు. సవాన్ నెల సందర్భంగా తేజ్ ప్రతాప్ శివుడి వేషయంలో దర్శనమిచ్చాడు.

news18-telugu
Updated: July 23, 2019, 5:52 PM IST
శివుడి గెటప్‌లో లాలూ కొడుకు... గుడిలో పూజలు
శివుడి గెటప్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్(Photo/ANI)
  • Share this:
మరోసారి విభిన్నమైన గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ఎప్పుడూ ఏదో ఒక గెటప్ తో దేశ ప్రజలను ఆకర్షించే తేజ్ ప్రతాప్... శివుడి గెటప్‌లో పూజలు నిర్వహించాడు. సవాన్ నెల సందర్భంగా తేజ్ ప్రతాప్ శివుడి వేషయంలో దర్శనమిచ్చాడు. బీహార్ రాజధాని పట్నాలోని ఓ శివాలయంలో శివుడి గెటప్ లో వెళ్లి పూజలు నిర్వహించడం అక్కడి వారికి షాక్ ఇచ్చింది. ఈ రకమైన వేషాలు వేయడం తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కొత్తమే కాదు. గతేడాది కూడా తేజ్ ప్రతాప్ శివుడి గెటప్ లో వెళ్లి పట్నాలోని శివాలయంలో పూజలు నిర్వహించాడు.
ఆలయ పూజారి హారతి ఇస్తున్న సమయంలో డమరుఖం మోగిస్తూ శూలాన్ని తిప్పుతూ తేజ్ ప్రతాప్ అచ్చం శివుడిలా మారిపోయాడు. 2017లో కూడా న్యూయర్ సందర్భంగా శ్రీకృష్ణుడి గెటప్ లో తేజ్ ప్రతాప్ దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. తేజ్ ప్రతాప్ రాజకీయాల కంటే ఎక్కువగా ఈరకంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాడనే టాక్ ఉంది. లాలూ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్... గతంలో బీహార్ మంత్రిగా కూడా వ్యవహరించాడు. తమ్ముడు తేజస్వి యాదవ్‌తో రాజకీయంగా విబేధించిన తేజ్ ప్రతాప్... ఎన్నికల్లో ఆర్జేడీకీ వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య నుంచి విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు.

First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...