క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం... రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స

లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాష్ట్రములోని గోపాల్గన్ జిల్లా, పుల్వారియా గ్రామానికి చెందిన ఒక యాదవ రైతు కుటుంబములో జన్మించారు.

news18-telugu
Updated: September 1, 2019, 9:55 AM IST
క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం... రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స
లాలూ ప్రసాద్ యాదవ్(File)
news18-telugu
Updated: September 1, 2019, 9:55 AM IST
బీహార్ మాజీ సీఎం , రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో పాటు  బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సైతం నిలకడగా లేవని అంటున్నారు. దాణా స్కాంలో... బిర్సా ముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

రిమ్స్‌లో లాలూ చేరినప్పటి నుంచి ఆయనకు డాక్టర్ డీకే ఝా వైద్యచికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బ్లడ్ ఇన్‌పెక్షన్ లాలూ శరీరంలో వ్యాపించిందని, ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ ఝా తెలిపారు. యాంటీబయోటిక్ మెడిసన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు. లాలూ తీసుకునే డయిట్ కూడా గతంలో కంటే తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నామని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యబృందంలో ఒకరైన డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు.

లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాష్ట్రములోని గోపాల్గన్ జిల్లా, పుల్వారియా గ్రామానికి చెందిన ఒక యాదవ రైతు కుటుంబములో జన్మించారు. పాట్నా యూనివర్శిటీలో రాజనీతిశాస్త్రములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. లాలూకు 1973, జూన్ 1న రాబ్డీ దేవితో వివాహమైంది. ఈయన భార్య రాబ్దీ దేవి కూడా కొన్నాళ్ళు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. లాలూ, రాబ్దీ దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. 29 సంవత్సరముల పిన్న వయస్సులోనే లాలూ 6వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.

First published: September 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...