అమరావతిపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు... ఆ భూములు...

వైసీపీ ప్రభుత్వం కారణంగానే అమరావతికి పెట్టుబడులు రావడం లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను లక్ష్మీపార్వతి తప్పుబట్టారు.

news18-telugu
Updated: November 27, 2019, 6:03 PM IST
అమరావతిపై లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు... ఆ భూములు...
లక్ష్మీ పార్వతి ( ఫేస్ బుక్ ఫోటో)
  • Share this:
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి వెళ్లిపోదని ఆమె వ్యాఖ్యానించారు. రాజధానిపై టీడీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కారణంగానే అమరావతికి పెట్టుబడులు రావడం లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను లక్ష్మీపార్వతి తప్పుబట్టారు. అమరావతిలో కొంత మేర నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని... రైతులు కోరితే వారికి కొంత మేర భూమిని వెనక్కి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తనకు అనిపించిందని తెలపారు.

అమరావతి నిర్మాణం విషయంలోనూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నిధులు మిగులుతాయని అన్నారు. అమరావతిలోని భూములను చంద్రబాబు తనకు సంబంధించిన వ్యక్తులకు కట్టబెట్టారని ఆమె ఆరోపించారు.

First published: November 27, 2019, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading