• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • LAKSHMAN MAY LOSE STATE PRESIDENT POST TO DK ARUNA IF RESULTS NOT FAVOUR OF BJP AK

తెలంగాణ బీజేపీ చీఫ్‌కు కొత్త పరీక్ష... ఫెయిలైతే...

బీజేపీ జెండా

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోతే... లక్ష్మణ్‌కు పదవీ గండం తప్పకపోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు.

  • Share this:
    తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. డిసెంబర్‌లోనూ రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ వస్తారని చాలాకాలం నుంచి ప్రచారం జరిగినా... ఈ విషయంలో ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికలు లక్ష్మణ్‌కు పెద్ద పరీక్ష కాబోతున్నాయని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని మరోసారి తన సొంతం చేసుకోవాలని లక్ష్మణ్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆయన జాతీయస్థాయిలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

    తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీమంత్రి డీకే అరుణ కూడా గట్టిగా పోటీ పడుతుండటంతో... ఈసారి పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంతలోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో... ఈ సమస్యకు ఎన్నికలే పరిష్కారం చూపిస్తాయనే టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తేనే... ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌కు పార్టీ నాయకత్వం మరోసారి అవకాశం ఇవ్వనుందని చర్చ జరుగుతోంది.

    Lakshman, bjp, dk aruna, telangana, telangana municipal elections 2020, లక్ష్మణ్, బీజేపీ, డీకే అరుణ, తెలంగాణ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు 2020
    డీకే అరుణ, లక్ష్మణ్


    ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాకపోతే... లక్ష్మణ్‌కు పదవీ గండం తప్పకపోవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే అరుణ తెలంగాణ బీజేపీ చీఫ్ కావడం ఖాయమనే అనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి కొత్త పరీక్ష పెట్టబోతున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: