LAGADAPATI RAJAGOPAL SURVEY ON AP ELECTIONS 2019 LAGADAPATI RAJAGOPAL SURVEY PREDICTS TDP VICTORY IN AP ASSEMBLY ELECTIONS 2019 TDP MAY GET 100 SEATS AND YSRCP WILL RESTRICTED TO 72 SEATS AK
Lagadapati Rajagopal survey: చంద్రబాబుదే అధికారం... టీడీపీకి 100, వైసీపీకి 72 సీట్లు... లగడపాటి సర్వే లెక్క
లగడపాటి రాజగోపాల్, చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
Lagadapati Rajagopal survey on Ap elections 2019 | ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే అంచనాలు వచ్చేశాయి. ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రాబోతోందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే తేల్చింది. టీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లగడపాటి సర్వే అంచనాలు వచ్చేశాయి. తెలంగాణ టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చిన లగడపాటి... ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశ ఉందని లగడపాటి తెలిపారు. ఈ లెక్కన చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక లోక్ సభ స్థానాల విషయంలోనూ టీడీపీకే మొగ్గు ఉందని లగడపాటి సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13-17, వైసీపీ 8-12, ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే అంచనా వేసింది.
మహిళా ఓటర్లు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గుచూపారని.. పురుష ఓటర్లు వైసీపీకి ఎక్కువగా ఓట్లు వేశారని ఈ సర్వేలో తేలింది. ఇక యువత ఓట్లు జనసేనకు ఎక్కువగా పడినట్టు సర్వే అభిప్రాయపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకంగా కొంతమేర ఉందని ఈ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 43 నుంచి 45 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 40 నుంచి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి సర్వే అంచనా వేసింది. ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జనసేనకు 10 నుంచి 15 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా పార్టీలకు ఈ స్థాయిలో ఓట్లు దక్కొచ్చని సర్వేలో తేలింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.