లగడపాటి సర్వేను నమ్ముకుంటే నాశనమే...ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీడీపీకి పట్టంగట్టిన ఆర్జీ ఫ్లాష్ సర్వేను ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఆహ్వానించారు. అంతకు మించిన స్థానాలే వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటి సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడి హాట్‌టాపిక్‌గా మారారు

news18-telugu
Updated: May 21, 2019, 8:14 PM IST
లగడపాటి సర్వేను నమ్ముకుంటే నాశనమే...ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
  • Share this:
ఏపీలో అధికారం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. పలు సర్వేలు వైసీపీకి మొగ్గుచూపగా..మరికొన్ని టీడీపీకి పట్టంగట్టాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి రాజగోపాల్ సర్వేపై జనాలకు కాస్త ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఐతే ఏపీలో టీడీపీదే అధికారమని ఆర్జీ ఫ్లాష్ సర్వే జోస్యంచెప్పింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 90-110, వైసీపీకి 65-77 సీట్లు, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశముందని లగడపాటి తెలిపారు. ఈ క్రమంలో లగడపాటి ఎగ్జిట్ పోల్స్‌పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సర్వేలను నమ్ముకుంటే నాశనమేనని విమర్శించారు.


ప్రజల నాడిని తెలిసిన వాళ్లే ఎగ్జిట్ పోల్స్ చేయాలి. పనికి మాలిన వాళ్లు ఎగ్జిట్ పోల్స్ చేస్తే ప్రజలకు ప్రమాదం. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ సర్వేను నమ్మి చాలా మంది పందేలు కాసి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. తెలంగాణలో రూ.600 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు బెట్టింగ్స్ జరిగాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ చూసి వారంతా సర్వ నాశనమయ్యారు. ఆయన నమ్మి మోసపోయామని నాతో చాలా మంది చెప్పారు.
అయ్యన్నపాత్రుడు
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు(File)
అయ్యన్నపాత్రుడు(File)

టీడీపీకి పట్టంగట్టిన ఆర్జీ ఫ్లాష్ సర్వేను ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఆహ్వానించారు. అంతకు మించిన స్థానాలే వస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటి సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడి హాట్‌టాపిక్‌గా మారారు. కాగా, మే 23న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్నాయి.
First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...