Home /News /politics /

LAGADAPATI RAJAGOPAL SAYS HE WONT DO SURVEYS IN FUTURE BA

Lagadapati Survey: లగడపాటి రాజగోపాల్ సర్వే సన్యాసం.. సంచలన ప్రకటన

లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్

Lagadapati Survey | ‘ప్రజానాడి పసిగట్టడంలో రెండుసార్లు విఫలం అయినందుకు గాను ఇకముందు సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నాను.’ అని ఆ లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సర్వేలు చేయబోనని ప్రకటించారు. వరుసగా రెండు సార్లు తన సర్వేలు విఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజానాడి పసిగట్టడంలో రెండుసార్లు విఫలం అయినందుకు గాను ఇకముందు సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నాను.’ అని ఆ ప్రకటలో పేర్కొన్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలు.. అసలు ఫలితాలకు దగ్గరగా ఉండేవి. దీంతో లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే క్రేజ్ ఉండేది. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ఆయన చెప్పిన లెక్కలు తారుమారు అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే, ఆఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 117 సీట్లకు గాను 88 స్థానాల్లో విజయం సాధించింది.



    ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని లగడపాటి చెప్పారు. టీడీపీకి 100కు పైగా సీట్లు వస్తాయని, వైసీపీకి 69 వరకు సీట్లు రావొచ్చని అంచనా వేశారు. కానీ, వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 175కు గాను 151 సీట్లు సాధించింది. అధికార టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితం అయింది. జనసేన ఒక్క సీటు సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారని, ఆయన అసెంబ్లీలో అడుగుపెడతారంటూ లగడపాటి చెప్పిన విషయం కూడా ఫెయిలైంది. వరుసగా ఆయన సర్వేలు విఫలం కావడంతో లగడపాటి రాజగోపాల్ పరువు పోయింది. దీంతో ఇకపై తాను సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన సర్వేల వలన ఎవరైనా నొచ్చుకుని ఉంటే మన్నించగలరని లగడపాటి కోరారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lagadapati, Lagadapati survey, Lok Sabha Election 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు