ఏపీ ఎన్నికల ఫలితాలకు మరో మూడురోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపే... ఏపీ ఫలితాలపై విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన అంచనాల్ని ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో కలకలం రేగుతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారని అయితే ఇది తన అంచనా మాత్రమేనని లగడపాటి ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనపించగా... వైసీపీ మాత్రం లగడపాటి అంచనాల్ని తప్పు పడుతోంది. లగడపాటి అంచనాలు చాలా సందర్భాల్లో తారుమారు అయ్యాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి అంచనాలు పూర్తిగా తారుమారు అయ్యాయని ఏపీ కూడా అదే జరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో తన సర్వే ఎందుకు తప్పిందో అన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వే సందర్భంగా వెల్లడిస్తానని లగడపాటి చెప్తున్నారు. అయితే పలు సందర్భాల్లో లగడపాటి లెక్కలు తప్పాయి.
2016 మే లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి పార్టీ డీఎంకే భారీ మెజార్టీతో అధికారం చేజెక్కించుకుంటుందన్నారు లగడపాటి. జయలలిత పార్టి AIADMK ఓడిపోతుందని జోస్యం చెప్పారు. DMK బంపర్ మెజారిటీతో గెలుస్తుందన్నారు. కానీ... ఫలితాలు వచ్చెసరికి AIADMK జయలలిత పార్టికి 134 సీట్లు రాగా , DMK కరుణ నిధి పార్టికి 89 స్థానాలు మాత్రమే వచ్చాయి , ఈ ఫలితాలు లగడపాటి సర్వేని పూర్తిగా తారుమారు చేశాయి.
ఇక గతేడాది 2018 మే లో జరిగిన కర్నాటక ఎన్నికలలొ మెజారిటి సర్వేలు హంగ్ ఏర్పడుతుంది అని చెప్పగా ,లగడపాటి సర్వే మాత్రం బీజేపీకి తిరుగులేని మేజారిటి వస్తుందని తేల్చింది. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పింది. అయితే అక్కడ అది జరగలేదు. ఫలితాలు వచ్చెసరికి లగడపాటీ సర్వే కర్నాటకలో కూడా తారుమారు అయ్యింది.
మెజారిటి సర్వేలు చెప్పినట్టుగా ఎవరికి ప్రభుత్వం ని ఏర్పాటూ చెసే నెంబర్ రాక హంగ్ ఏర్పడింది. చివరికి కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి జేడీఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా లగడపాటి లెక్క తప్పింది.
ఆంధ్రా ఆక్టోపస్ సర్వే పేరుతో చెప్పె ఫలితాలు ఏమి బ్రహ్మ్మ వాక్కులు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన చెసిన సర్వేలు తారుమారైన సందర్భాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. అందుకే లగడపాటి లెక్కలు నిజమవుతాయనే అపోహలో పడి బెట్టింగులకు పాల్పడి ఒళ్ళు , ఇళ్ళు గుళ్ళ చెసుకుని రొడ్డున పడొద్దని బెట్టింగ్ రాయుళ్లను సూచిస్తున్నారు. ఏదిఏమైన లగడపాటి సర్వే నిజానిజాలు మే 23న తేలిపోనున్నాయి.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.