వైసీపీ గెలిస్తే లగడపాటి సర్వే సన్యాసం... నిజమేనా ?

లగడపాటి రాజగోపాల్ అంచనాలు నిజమైతే ఓకే కానీ... ఈసారి కూడా ఆయన ప్రజల నాడిని పసిగట్టడంతో విఫలమైతే మాత్రం ఇక ఆయన ఈ విషయంలో ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరైతే ఈ సారి లగడపాటి సర్వే ఫలితాలు నిజం కాకపోతే ఆయన సర్వేల్లోనూ సన్యాసం తీసుకుంటారని చర్చించుకుంటున్నారు.

news18-telugu
Updated: May 21, 2019, 8:32 AM IST
వైసీపీ గెలిస్తే లగడపాటి సర్వే సన్యాసం... నిజమేనా ?
లగడపాటి రాజగోపాల్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందంటూ తన సర్వే అంచనాలను వెల్లడించిన ఆంధ్రా ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... తన అంచనాలు మరోసారి తప్పితే ఏం చేస్తారనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీలో వైసీపీ గెలుస్తుంటూ అనేక ఇతర సర్వేలు అంచనా వేశాయి. కానీ లగడపాటి మాత్రం ఇందుకు భిన్నంగా తన సర్వే అంచనాలను వెల్లడించారు. ఏపీలో గెలుపు మరోసారి టీడీపీదే అని వాదించారు. దీంతో అధికార మార్పిడి ఖాయమనుకున్న ఏపీలో నిజంగానే అది జరుగుతుందా లేదా అనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సారి లగడపాటి సర్వే ఏపీ రాజకీయ వర్గాలు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణ ఎన్నికలకు ముందు నానా హంగామా సృష్టించిన లగడపాటి రాజగోపాల్... ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఘోరంగా విఫలయ్యారు. దీంతో సెఫాలజిస్ట్‌గా ఆయనకున్న ఇమేజ్ చాలావరకు దెబ్బతిన్నది.

నిజానికి తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత మళ్లీ ఆయన సర్వేల జోలికి వెళతారని కూడా ఎవరూ అనుకోలేదు. అయితే ఆయన మాత్రం ఏపీ ఫలితాలను అంచనా వేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందే ఈసారి కూడా ఫలితాల అంచనాలను ప్రకటిస్తానని చెప్పిన లగడపాటి రాజగోపాల్... చెప్పినట్టుగానే తన సర్వే అంచనాలను వెల్లడించారు. ఏపీలో వైసీపీ హవా బలంగా వీస్తోందనే ప్రచారం జరుగుతున్న సమయంలో... మరోసారి అధికారం టీడీపీ సొంతమవుతుందని ఆయన చెప్పడం ఫలితాలపై ఉత్కంఠను మరింతగా పెంచేసింది. లగడపాటి రాజగోపాల్ అంచనాలు నిజమైతే ఓకే కానీ... ఈసారి కూడా ఆయన ప్రజల నాడిని పసిగట్టడంతో విఫలమైతే మాత్రం ఇక ఆయన ఈ విషయంలో ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదనే వాదన బలంగా వినిపిస్తోంది.

కొందరైతే ఈ సారి లగడపాటి సర్వే ఫలితాలు నిజం కాకపోతే ఆయన సర్వేల్లోనూ సన్యాసం తీసుకుంటారని చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత సర్వేలు చేసే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్న లగడపాటి టీమ్... తమ అంచనాల విషయంలో ధీమాగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోసారి తన సర్వే అంచనాలు తప్పినా... లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేయించడం మానేసే అవకాశం లేదని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా... ఈసారి కూడా లగడపాటి అంచనాలు తప్పితే ఆయన సర్వేలకు ఉన్న విశ్వసనీయత పూర్తిగా పోయినట్టే అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
First published: May 21, 2019, 8:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading