Home /News /politics /

LAGADAPATI RAJAGOPAL COMMENTS ON YCP AND JANASENA WINNING SEATS SB

ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఎటువైపు? వైసీపీకి లగడపాటి సర్వే షాకిచ్చిందా?

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్

జనసేన రావడం వల్ల వైసీపీకి టీడీపీకి నష్టం జరిగిందా? అన్న మీడియా అడిగిన ప్రశ్నకు లగడపాటి అవునంటూ సమాధానమిచ్చారు.

    ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా శనివారం నాడు అమరావతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పరోక్షంగా టీడీపీదే విజయం అని స్పష్టం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా గెలుస్తారని... అసెంబ్లీలో అడుగు పెడతారని జోస్యం చెప్పారు. ఇక ఏపీ ప్రజలు టీడీపీకే పట్టం కడతారన్నారు. లగడపాటి
    జనసేన రావడం వల్ల వైసీపీకి టీడీపీకి నష్టం జరిగిందా? అన్న మీడియా అడిగిన ప్రశ్నకు లగడపాటి అవునంటూ సమాధానమిచ్చారు. ఇదే సమయంలో టీడీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది అనడం వల్ల... సీట్ల సంఖ్య తగ్గిన పర్వాలేదన్న ఫీలింగ్‌లో ఉన్నారు టీడీపీ నేతలు. సీట్ల సంఖ్య తగ్గినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనన్న ధీమాలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. మరి ఇక్కడే కాస్తో కూస్తో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎవరికి పడ్డాయన్న ? సందేహం తలెత్తుతోంది. టీడీపీ సీట్లు ఆ పార్టీకే ఉన్నాయని లెక్క చెప్పారు లగడపాటి అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత జనసేనకు వెళ్లిపోయిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లగడపాటి సర్వే లెక్కలు నిజమైనా లేకున్నా... వైసీపీలో మాత్రం ఈ వ్యవహారంతో కాస్త టెన్షన్ మొదలయ్యింది. ఎందుకంటే నిన్నటివరకు తమదే అధికారం అన్న ధీమాలో ఉన్న వైసీపీ తాజాగా లగడపాటి ఇచ్చిన షాక్‌తో ఆందోళనలో పడిపోయింది.

    అయితే ఇన్ని లెక్కలు చెప్పిన లగడపాటి చివరిలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఇది త‌న అంచ‌నా అంటూ..స‌ర్వే వివ‌రాలు ఆదివారం చెబుతానంటూ స‌మాధానం ఇచ్చారు. ఏపీలో స్ప‌ష్ట‌మైన మెజార్టీతోనే ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందని తేల్చి చెప్పారు. ఆదివారం చివ‌రి విడ‌త పోలింగ్ జ‌ర‌గాల్సి ఉండ‌టంతో..పూర్తి వివ‌రాలు ఆదివారం సాయంత్రం వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 23వ తేదీ న వెల్ల‌డ‌య్యే ఫ‌లితాల‌కు అనుగుణంగా ప్ర‌జల నాడి తెలుసుకొనేందుకు ఆర్‌జి ఫ్లాష్ టీం ద్వారా వేలాది మందిని శాంపిల్‌గా తీసుకొని స‌ర్వే వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఏపీలో రాజ‌ధాని పాండ‌వుల ఇంద్ర‌ప్రస్థానంగా నిర్మాణం సాగుతుంద‌ని విశ్లేషించారు. ఏపీలో సంక్షేమం..అభివృదంది కొన‌సాగుతుంద‌ని వివ‌రించారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Janasena, Janasena party, Pawan kalyan, Ys jagan mohan reddy, Ysrcp

    తదుపరి వార్తలు