తెలంగాణలో 'లగడపాటి సర్వే'పై రాజగోపాల్ క్లారిటీ!

'లగడపాటి సర్వే' పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని రాజగోపాల్ చెప్పారు.

news18-telugu
Updated: September 12, 2018, 8:10 PM IST
తెలంగాణలో 'లగడపాటి సర్వే'పై రాజగోపాల్ క్లారిటీ!
లగడపాటి రాజగోపాల్ (ఫైల్ ఫోటో)
  • Share this:
పొలిటికల్ సర్వేల్లో లగడపాటి సర్వేకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఏ ఎన్నికలైనా సరే.. లగడపాటి సర్వే ఏం చెప్పబోతుందా? అని జనం సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముందస్తు ఎన్నికలపై లగడపాటి జోస్యం ఏమిటన్న దానిపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఇలాంటి తరుణంలో లగడపాటి సర్వే పేరిట సోషల్ మీడియాలో ఓ సర్వే చక్కర్లు కొడుతుండటంతో అందరి దృష్టి దానిపై పడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే అధికార పీఠాన్ని దక్కించుకుంటుందన్నది ఆ సర్వే సారాంశం. అయితే ఇది నిజంగా లగడపాటి జరిపించిన సర్వేనేనా?.. లేక సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమా? అన్న అనుమానం కూడా మొదలైంది.

ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తాను ఎలాంటి సర్వే జరిపించలేదని స్పష్టం చేశారు. 'లగడపాటి సర్వే' పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని చెప్పారు. తానే గనుక సర్వే జరిపించి ఉంటే.. స్వయంగా వెల్లడిస్తానని, కాబట్టి ఈ ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.

కాగా, లగడపాటి సర్వే పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో.. కాంగ్రెస్-61, టీఆర్ఎస్-39, ఎంఐఎం-07, టీడీపీ-03, బీజేపీ-03, సీపీఐ-2, సీపీఎం-1, ఇతరులు-3 స్థానాలను గెలుచుకుంటారని ఊదరగొడుతున్నారు. స్వయంగా లగడపాటి రాజగోపాలే ఈ సర్వేతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చేయడంతో.. ఇదంతా వట్టి బోగస్ అని తేలినట్టయింది.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading