వైసీపీ నేతలపై మహిళా డాక్టర్ సంచలన ఆరోపణలు..డాక్టర్ సుధాకర్ తరహాలో మరో వివాదం

తనను బెదిరించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసి 3 నెలలవుతున్నా పట్టడించుకోవడం లేదని టీడీపీ నేత అనితతో తన గోడును వెల్లబోసుకున్నారు.

news18-telugu
Updated: June 8, 2020, 2:49 PM IST
వైసీపీ నేతలపై మహిళా డాక్టర్ సంచలన ఆరోపణలు..డాక్టర్ సుధాకర్ తరహాలో మరో వివాదం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ డాక్టర్ సుధాకర్ వివాదం మరవకముందే మరో ఘటన తెరపైకి వచ్చింది. వైసీపీ నేతలపై చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వాస్పత్రి మహిళా డాక్టర్ అనితా రాణి సంచలన ఆరోపణలు చేశారు. కింది స్థాయి ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు, పోలీసులు తనను టార్గెట్ చేసిన తెలిపారు. దీనికి సంబంధించి టీడీపీ నేత అనితకు ఆమె ఫిర్యాదు చేశారు. వారిద్దరి ఫోన్ కాల్ సంభాషణను టీడీపీ నేత నారా లోకేష్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మార్చి 22న తనపై వైసీపీనేతలు దాడి చేశారని.. ఆస్పత్రిలో బాత్రూమ్‌లో ఉన్నప్పుడు ఫొటోలు తీశారని ఆరోపించారు అనితా రాణి. తనను బెదిరించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసి 3 నెలలవుతున్నా పట్టడించుకోవడం లేదని టీడీపీ నేత అనితతో తన గోడును వెల్లబోసుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే పీఎస్‌కు పిలిపించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కూర్బోబెట్టారని.. కానీ ఎవరూ స్పందించలేదని అనితారాణి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కేసులు పెట్టొద్దంటూ వైసీపీ నేతలు బెదిరించారని, ఉన్నతాధికారులతో ఫోన్లు చేయించి ఒత్తిడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ లేదని, మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని టీడీపీ నేతకు ఆమె ఫోన్‌లో వివరించారు. ఈ ఘటనకు సంబంధించి న్యాయకోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు అనితా రాణి.

అనితా రాణి వ్యవహారంపై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రెడ్డి దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. వైసీపీ నేతల అవినీతికి సహకరించనందుకు దళిత దాక్టర్‌ను వేధించడం దారుణమని ఆయన ట్వీట్ చేశారు. మహిళా డాక్టర్‌ను బూతులు తిడుతూ ఫొటోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
First published: June 8, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading