Home /News /politics /

L RAMANA TO MEET CM KCR TODAY ALNG WITH MINISER ERRABELLLI DAYAKAR RAO HE IS LIKELY TO JOIN TRS PARTY SK

L Ramana: టీఆర్ఎస్ గూటికి ఎల్. రమణ..! కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో కీలక భేటీ

సీఎం కేసీఆర్, ఎల్. రమణ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్, ఎల్. రమణ (ఫైల్ ఫోటో)

బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది . ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు . జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు .

    టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఈ సమయం వచ్చినట్లే కనిపిస్తోంది. ఎల్.రమణ గులాబీ గూటికి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో కలిసి ఆయన సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం.

    మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఇప్పటి వరకే ఓసారి మంతనాలు జరిపారు ఎల్.రమణ . ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చినట్లు సమాచారం.   తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలుగుదేశం పార్టీ బలం క్రమక్రమంగా తగ్గుతుండటంతో రాజకీయ భవిష్యత్‌ను దృష్ట్యా టీఆర్ఎస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారట. కార్యకర్తలతో కూడా ఈ విషయ గురించి మాట్లాడారట. వారు కూడా ఓకే చెప్పడంతో గులాబీ దళంలో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం కేసీఆర్‌తో భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది . ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు . జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు . జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు . చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని పేరుంది . తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు . రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, L Ramana, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు