Home /News /politics /

L RAMANA RESIGNS TO TELANGANA TDP PRESIDENT POST AND ANNOUNCED THAT HE IS JOINING TRS SK

L Ramana: టీడీపీకి ఎల్.రమణ రాజీనామా.. టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన

సీఎం కేసీఆర్, ఎల్. రమణ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్, ఎల్. రమణ (ఫైల్ ఫోటో)

ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. కేడర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా టీఆర్ఎస్‌లోకి వెళ్లాని రమణ నిర్ణయించుకున్నారు. టీడీపీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు.

    తెలంగాణలో ఎల్.రమణ రాజకీయ భవితవ్యంపై క్లారిటీ వచ్చింది. ఆయన టీఆర్ఎస్‌లో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై నిన్న సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం కీలక ప్రకటన చేశారు ఎల్. రమణ. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. తాను టీఆర్ఎస్‌లలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని, ప్రజకు మరింత చేరువవ్వాలని నిర్ణయించుకున్నాని..అందుకే టీడీపీ విడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఎల్. రమణ.

    గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎల్.రమణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌లోకి రావాలసిందిగా కేసీఆర్ ఆయన్ను ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆ భేటీ జరిగిన మరుసటి రోజే టీడీపీకి గుడ్‌బై చెప్పారు ఎల్.రమణ. త్వరలోనే ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు.



    టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన ఆయన స్థానాన్ని భర్తీ చేసే బలమైన బీసీ నాయకుడి కోసం సీఎం కేసీఆర్ అన్వేసిస్తున్నారు. ఆ నేతతోనే ఈటలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఎల్. రమణ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. ఈటల బీసీ నాయకుడు కావడంతో మరో బీసీ నాయకుడిని బరిలోకి దింపితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఉన్న కేసీఆర్.. ఇందుకోసం ఎల్.రమణను టీఆర్ఎస్‌లో చేర్చుకుని పోటీలో నిలిపితే బాగుంటుందనే యోచన చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, కరీంనగర్ ఎంపీగా పని చేసిన ఎల్.రమణకు హుజూరాబాద్ నియోజకవర్గంతో మంచి సంబంధాలే ఉన్నాయి.
    ఈ కారణంగానే ఆయన హుజూరాబాద్‌లో పోటీ కోసం ఎల్.రమణను ఎంపిక చేసుకున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను పార్టీలో తీసుకున్న తరువాత ఆయనను హుజూరాబాద్ నుంచి బరిలో దింపడం లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.

    ఉమ్మడి కరీంనగర్‌తో పాటు తెలంగాణలో బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది. ఈ నినాదంతోనే కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని పేరుంది తెలుగుదేశం నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లినా రమణ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. కేడర్ కూడా లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా టీఆర్ఎస్‌లోకి వెళ్లాని రమణ నిర్ణయించుకున్నారు. టీడీపీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, L Ramana, Telangana, Telangana Politics

    తదుపరి వార్తలు