ఢిల్లీలో అధిష్టానం వద్ద ఇద్దరు కాంగ్రెస్ నేతల లాబీయింగ్...

ఏపీలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పీసీసీ అధ్యక్షుడుగా శైలజానాథ్‌ను నియమించింది.

news18-telugu
Updated: January 31, 2020, 7:24 PM IST
ఢిల్లీలో అధిష్టానం వద్ద ఇద్దరు కాంగ్రెస్ నేతల లాబీయింగ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు వారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు మరోసారి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డిల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9న ముగియనుంది. దీంతో మరోసారి తమను పెద్దల సభకు పంపాలని వారిద్దరూ కాంగ్రెస్ అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డిలతో పాటు మరో కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అలీ ఖాన్ పదవీకాలం కూడా అదే సమయానికి ముగుస్తుంది. అయితే, కేవీపీ, టీఎస్ఆర్ మాత్రం తమకు మరోమారు రాజ్యసభకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిసింది.

ఎంపీ కేవీపీ రామచంద్రరావు(ఫైల్ ఫోటో)
కేవీపీ రామచంద్రరావు(ఫైల్ ఫోటో)


కేవీపీ రామచంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో మొత్తం ఆయనే చక్రం తిప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విబేధించి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన సోనియాగాంధీ వెనుకే నిలబడ్డారు. దీంతో నమ్మకస్తుడిగా భావించి ఆయనకు 2014లో మరోసారి కాంగ్రెస్ అధిష్టానం పెద్దల సభకు పంపింది. అలాగే, సుబ్బిరామిరెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా లేకపోయినా.. అవసరం అయినప్పుడు ఆయన పార్టీని ఆర్థికంగా ఆదుకుంటారని ఢిల్లీలో పేరుంది. దీంతో ఆయనను కూడా పార్టీ పెద్దలు పెద్దల సభకు పంపుతున్నారు.

tsr birthday celebrations,tsr birthday celebration,tsr birthday celebrations at vizag,tsr birthday celebration event,tsr birthday celebrations || tsr great words,tsr birthday celebration full event,tsr birthday celebration event live,birthday celebrations,t. subbarami reddy birthday celebrations,subbarami reddy birthdaya celebrations,birthday,tsr birthday event in vizag,టీఎస్ఆర్ పుట్టినరోజు,టి.సుబ్బిరామిరెడ్డికి రోజా బిరుదు,టి సుబ్బిరామిరెడ్డి బర్త్ డే,జయసుధకకు నటనమయూరి
టి.సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రోజా, వైవీ సుబ్బారెడ్డి, రాధిక, జయసుధ


ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేదు. రాజ్యసభకు పంపేంత పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పార్టీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (శివసేన, ఎన్సీపీతో పొత్తు), ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, పంజాబ్, పుదుచ్చేరి (డీఎంకేతో పొత్తు) లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట నుంచి తమను రాజ్యసభకు పంపాలని వారిద్దరూ పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలో నష్టపోతామని ఊహించినా.. తెలంగాణలో మాత్రం బలపడతామని లెక్కలు వేసింది. కానీ, కేసీఆర్ వ్యూహంతో అది మొత్తం బూమ్‌రాంగ్ అయింది. దీంతో ఏపీలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్లాన్ చేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పీసీసీ అధ్యక్షుడుగా శైలజానాథ్‌ను నియమించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 31, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading