మంత్రి అనిల్‌కు వైసీపీ కార్యకర్తల వార్నింగ్

నందికొట్కూరు ఎమ్మెల్యే అర్థర్ అనుచరులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: February 28, 2020, 5:51 PM IST
మంత్రి అనిల్‌కు వైసీపీ కార్యకర్తల వార్నింగ్
పవన్ కల్యాణ్ ఎప్పుడు కన్ఫ్యూజన్‌లో ఉంటారని మంత్రి అనిల్ విమర్శించారు. ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. పవన్‌ గురించి మాట్లాడటం అనవసరమని వ్యాఖ్యానించారు.
  • Share this:
కర్నూలు జిల్లా నందికొట్కూరు రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే అర్థర్ అనుచరులు ఏకంగా మంత్రి అనిల్ కుమార్‌కు వార్నింగ్ ఇవ్వడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ఇంఛార్జ్ సిద్ధార్థ్ రెడ్డి, ఎమ్మెల్యే అర్థర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో... ఎమ్మెల్యే అనుచరులు తాజాగా అనిల్ కుమార్‌ను టార్గెట్ చేస్తున్నారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తమ వర్గానికి కాకుండా సిద్ధార్థ్ రెడ్డి వర్గానికి ఇచ్చేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నిస్తున్నారనే అసంతృప్తితో ఉన్న అర్థర్ అనుచరులు... ఓ సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చారు.

నందికొట్కూరు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే కర్నూలు జిల్లాలో అడుగుపెట్టనీయబోమని ఎమ్మెల్యే అర్థర్ అనుచరులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నందికొట్కూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి తాజాగా వివాదం ఉదాహరణగా నిలుస్తోందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అధిష్టానంపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎమ్మెల్యే అర్థర్‌తో పాటు సిద్ధార్థ్ రెడ్డితో మాట్లాడేందుకు పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యే అనుచరులు ఏకంగా ఓ మంత్రికి వార్నింగ్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: February 28, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading