చంద్రబాబుకు మరో షాక్... కర్నూలు పర్యటనకు అడ్డుకుంటామన్న జేఏసీ

తాజాగా చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: December 1, 2019, 12:17 PM IST
చంద్రబాబుకు మరో షాక్... కర్నూలు పర్యటనకు అడ్డుకుంటామన్న జేఏసీ
చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబర్ రేపట్నుంచి కర్నూలు పర్యటనకు సిద్ధమవుతున్నారు. మూడు రోజులు పాటు కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కానీ చంద్రబాబు కర్నూలు పర్యటన గురించి తెలిసిన రాయలసీమ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు రావొద్దంటూ టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

రాయలసీమ ప్రాంతం ప్రయోజనాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం పని చేయలేదని విద్యార్థి సంఘాల జేఏసీ చెబుతోంది. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తే మాత్రమే చంద్రబాబు కర్నూలు జిల్లాలో చంద్రబాబును అడుగు పెట్టనిస్తామని విద్యార్థి సంఘాల జేఏసీ చెబుతోంది. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు అమరావతి పర్యటనలో చంద్రబాబుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు కర్నూలు జిల్లాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Published by: Sulthana Begum Shaik
First published: December 1, 2019, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading