Home /News /politics /

KUPPAM MUNICIPAL ELECTIONS FINAL RESULT YCP WON 19 WARDS TDP WON 6 WARDS ONLY NGS

Kuppam Result: కుప్పం మున్సిపాలిటీ ఫైనల్ ఫలితం ఇదే.. ఏ పార్టీ ఎన్నివార్డులు గెలిచాయి.. టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

కుప్పంలో వైసీపీ గెలుపు

కుప్పంలో వైసీపీ గెలుపు

Kuppam Municipal Election Results: కుప్పం అంటే అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబే.. ఆ నియోజకవర్గంపై ఆయన ముద్ర అలాంటింది. 40 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆయనకు.. ఇప్పుడు కుప్పం ప్రజలు షాక్ ఇచ్చారు. తాజా మున్సిపాలిటీ ఫలితల్లో ఘోర భంగపాటు ఎదురైంది. ఓటమి సంగతి అటు ఉంచితే కనీస పోటీ కనిపించలేదు. వార్ వన్ సైడ్ అయిపోయింది..

ఇంకా చదవండి ...
  Kuppam Municipal Election Results:  ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన నియోజకవర్గం కుప్పం..  ఎందుకంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  (TDP Chied Nara Chandra Babu Naidu) సొంత నియోజకవర్గం.  గత 40 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గం ఆయనకు అడ్డగా మారింది. అలాంటి కంచుకోట కుప్పంలో (Kuppam) చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఘన విజయం సాధించింది. అది కూడా సాధారణ విజయం కాదు.. మెగా విక్టరీ సాధించింది. వార్ ను వన్ సైడ్ చేసేసింది.  కుప్పంలోని 25 వార్డులు ఉంటే.. 19 వార్డులను వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితం అయ్యింది..  మెజార్టీ స్థానాల్లో  విజయంతో  వైఎస్సార్‌సీపీ కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కూమారుడు లోకేష్‌ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా.. కుప్పం ఓటర్లు అధికార పార్టీకి అండగా నిలడడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

  టీడీపీ కంచుకోటలో చంద్రబాబుకు షాకిచ్చామని వైసీపీ నేతలంటున్నారు. కుప్పంలో టీడీపీని ఓడించి తీరుతామని చెప్పిన వైసీపీ ఆ మాటను నిలబెట్టుకుంది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Rama Chandra Reddy).. అక్కడే మకాం వేసి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 

  ఇదీ చదవండి: కుప్పంలో చంద్రబాబుకు ఇక కష్టమే.. ప్రతి ఏడాది తగ్గుతున్నగ్రాఫ్.. కారణం అదేనా?

  కుప్పంలోని టీడీపీకి పూర్తి పట్టు ఉంది అనుకున్న 1,2,3, 4, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15,16,17, 21, 23, 25 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. ఇక 5, 11, 18, 19, 20, 22, వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. అయితే కచ్చితంగా కుప్పంలో హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అంచనా వేశారు.. కానీ ఎవరూ ఊహించని విధంగా 19 స్థానాల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.

  ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా.. గవర్నర్‌ బిశ్వబూషన్‌ హరిచందన్ కు పాజిటివ్

  కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో మూడు నెలలుగా వైసీపీ ముఖ్యనేతలు ఇక్కడ మకాం వేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి కుటుంబమంతా కుప్పంలోనే పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పోల్ మేనేజ్ మెంట్ లో విజయం సాధించారు. ప్రజల్లో చంద్రబాబపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

  ఇదీ చదవండి: చంద్రబాబు పార్టీని ఎన్టీఆర్ కుటుంబానికి వదిలేయాలి.. కుప్పంలో కష్టం.. పుంగనూరు రండి

  కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.. మొదలుకుని పోలింగ్ ముందు రోజు వరకూ వైసీపీ పెద్దలు, మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి.. అధికారం, డబ్బు.. దొంగ ఓట్లు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చేయాల్సినవన్నీ చేసి ఎట్టకేలకు కుప్పంలో అధికార పార్టీని గెలిపించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట్నుంచీ వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను టీడీపీ అధినేత చంద్రబాబు.. కుప్పం తెలుగు తమ్ముళ్లు.. పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అధికార పార్టీ గెలిచిందని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Kuppam, Municipal Elections, Tdp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు