కుప్పం జగన్ సభలో అప‌శృతి...తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి

మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచి బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే బేట్రాయుడు స్పృహ కోల్పోగా వెంటనే గుర్తించిన కార్యకర్తలు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

news18-telugu
Updated: April 5, 2019, 2:39 PM IST
కుప్పం జగన్ సభలో అప‌శృతి...తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి
వైఎస్ జగన్ : జాతకబలం తక్కువగా ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలరని చెబుతున్నారు. ఇదివరకటి కంటే జగన్ ఈసారి ప్రజాసేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పార్టీని బలోపేతం చెయ్యడంతోపాటూ... ఇతర పార్టీలతో కలిసి సాగితే కలిసొస్తుందంటున్నారు. ప్రజాధరణ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ... చివరి క్షణాల్లో జాతక బలం సరిగా లేనందువల్ల వ్యతిరేక పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయంటున్నారు.
  • Share this:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో అప‌శృతి చోటు చేసుకుంది. బహిరంగ సభ ముగిసిన అనంతరం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి ఊపిరాడక మరణించారు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచి బేట్రాయుడుగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే బేట్రాయుడు స్పృహ కోల్పోగా వెంటనే గుర్తించిన కార్యకర్తలు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Published by: Krishna Adithya
First published: April 5, 2019, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading