రేపు సాయంత్రం వరకే సీఎం పోస్టులో కుమారస్వామి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections 2019: కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందని, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారని కేంద్ర మంత్రి సదానందగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: May 22, 2019, 3:02 PM IST
రేపు సాయంత్రం వరకే సీఎం పోస్టులో కుమారస్వామి.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
kumara swamy cm
  • Share this:
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేదే మళ్లీ అధికారం అని తేల్చేయడంతో.. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వాలు కూలిపోతాయని ప్రచారం జోరందుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ ప్రభుత్వం అధికారం కోల్పోబోతోందని, రేపు సాయంత్రం వరకే కుమారస్వామి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారని కేంద్ర మంత్రి సదానందగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ సిద్దరామయ్యపై విరుచుకుపడిన అనంతరం సదానందగౌడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ తిట్టిపోసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే అత్యధిక సీట్లు దక్కుతాయంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో రోషన్‌ బేగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దీంతో రోషన్‌ బేగ్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించిన సదానంద గౌడ.. రేపు సాయంత్రం వరకే కుమార స్వామి సీఎం పోస్టులో ఉంటారని అనడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆస్తకికరంగా మారాయి.
First published: May 22, 2019, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading