సీఎం పదవి పోతుందనే సెంటిమెంట్... అయినా ధైర్యం చేసిన జగన్

ప్రతీకాత్మక చిత్రం

గ్యాస్ లీక్ జరిగిన వెంటనే సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితలను కలిశారు.

  • Share this:
    అక్కడికి వెళితే ముఖ్యమంత్రి పదవి పోతుందని సెంటిమెంట్. అయినా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చేసి మరీ వెళ్లారంటూ ముఖ్యమంత్రిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు వైసీపీ నేత ప్రసాద్ వి పొట్లూరి. ‘ప్రజా సంక్షేమం ప్రధానం, పదవి కాదు Thumbs up ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తరువాత వైజాగ్ కే.జీ.హెచ్ లోకి అడుగుపెట్టారు. 1995 లో ఎన్.టీ.ఆర్ గారు కే.జీ.హెచ్ లో అడుగుపెట్టాక పదవి పోయింది. ఆ భయంతో తరువాత ఏ ముఖ్యమంత్రీ అడుగు పెట్టలేదు.Way to go @ysjagan Garu’ అని పీవీపీ ట్వీట్ చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అందులో కొందరు బాధితులు విశాఖ కేజీహెచ్‌లో చేరారు. మరికొందరు వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 12 మంది ఈ గ్యాస్ లీక్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. సుమారు300 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారు ఎవరికీ ప్రమాదం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.    గ్యాస్ లీక్ జరిగిన వెంటనే సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖ వెళ్లారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితలను కలిశారు. వారి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లల వద్దకు వెళ్లిన జగన్ వారు కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం, చికిత్స పొందుతున్న వారికి రూ.25000 నుంచి రూ.10 లక్షల వరకు సాయం ప్రకటించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల నివసించే 15000 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల సాయం అందిస్తామని చెప్పారు. ఈ పరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసింది ప్రభుత్వం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: