చిరంజీవికి షాక్ ఇచ్చిన మంత్రి కేటీఆర్

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందుకు తగ్గట్లే ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 12, 2019, 7:40 PM IST
చిరంజీవికి షాక్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
కేటీఆర్, చిరంజీవి
  • Share this:
సైరా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌పై కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట ముంబైలో అనుకున్నారు. కానీ సెట్ కాలేదు. ఆ తర్వాత కర్నూల్‌లో ప్లాన్ చేద్దామనుకున్నారు. అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో చివరకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సైరా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఖరారు చేసింది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఈ నెల 18న ప్రి-రిలీజ్, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందుకు తగ్గట్లే ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈ మెగా ఈవెంట్‌కు వచ్చే అతిథులు ఎవరని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అతిథులకు సంబంధించి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులగా హాజరవుతారని తెలిపింది. ఐతే ఈ ప్రకటన చేసిన కాసేపటికే ట్విటర్ వేదికగా మరో ప్రకటన చేశారు. సైరా ప్రిరిలీజ్ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హాజరుకావడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆయన రావడం లేదని తెలిపారు. వస్తానని ముందుగా చెప్పి..ఆ తర్వాత రానని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. సైరా మూవీలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క, తమన్నా వంటి అగ్ర సినీ నటులు నటించారు. దాంతో ఈ మూవీపై శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ వర్గాలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 10 దేశాల్లోని మొత్తం 26 ప్రదేశాల్లో సైరాకి సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading