Home /News /politics /

KTR SATIRICAL COMMENTS ON AP CM CHANDRABABUNAIDU PS

విజయవాడలో బొంగరం కూడా తిప్పలేడు.. చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్

కేటీఆర్, చంద్రబాబు నాయుడు(File)

కేటీఆర్, చంద్రబాబు నాయుడు(File)

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీ ప్రజల అనుమతి లేకుండా వారి డేటాను టీడీపీ తస్కరించిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఇంకా చదవండి ...
    ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీ ప్రజల అనుమతి లేకుండా వారి డేటాను టీడీపీ తస్కరించిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ముచ్చటించిన కేటీఆర్.. రాబోయే ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏదో చేసేద్దామనుకుంటున్నారని, అదంతా ఉత్తిదేనని కొట్టిపారేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం కాదు కదా.. చంద్రబాబు విజయవాడలో బొంగరం కూడా తిప్పలేరని కేటీఆర్ సెటైర్ వేశారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును పూర్తిగా తిరస్కరించబోతున్నారని స్పష్టం చేశారు.

    ఏపీలో చంద్రబాబు ఓటమికోసం తాము ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పన్లేదని కేటీఆర్ అన్నారు. ఇది కూడా ఓ రకంగా ప్రచారమేనన్నారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం తప్పుకాదని, టీడీపీలా కులాల పరంగా ప్రజలను విభజించి డేటాను సిద్ధం చేయడం ముమ్మాటికి తప్పేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ ఆరోపించారు. ఏపీలో సర్వేలు చేసిన కొన్ని సంస్థలు తమతో ఫలితాలను షేర్ చేసుకున్నాయని... అవి చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

    ఇక, ఎన్నికల ముందు ఎవరు ఏం చేసినా విశ్వసనీయత ఉండదని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేటీఆర్. విశాఖ రైల్వేజోన్ ప్రకటన వల్ల రాబోయే ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందనుకోవడం బీజేపీ మూర్ఖత్వమే అవుతుందన్నారు. రాజకీయ పార్టీల కంటే ప్రజలు తెలివైనవారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్‌తో బీజేపీ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తే.. పుల్వామా దాడి ఎందుకు జరిగిందో కూడా ప్రజలకు వివరించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ కీలకం కానుందన్న కేటీఆర్.. రాహుల్ గాంధీనీ గానీ, మోదీని గానీ ప్రధానిగా చూడాల్సిన దౌర్భాగ్యం దేశ ప్రజలకు మళ్లీ పట్టబోదన్నారు. వీళ్లిద్దరూ కలిసినా.. రాబోయే ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని జోస్యం చెప్పారు.
    First published:

    Tags: Chandrababu naidu, KTR, Personal Data, Pm modi, Rahul Gandhi, Visakha Railway Zone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు