టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సరికొత్త హుకుం

టీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: September 13, 2019, 3:09 PM IST
టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సరికొత్త హుకుం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
news18-telugu
Updated: September 13, 2019, 3:09 PM IST
టీఆర్ఎస్ నేతలు ఈ మధ్యకాలంలో ఏ మాట్లాడినా... రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణ తరువాత కొందరు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. నేతలెవరూ అఫీషియల్‌గా మీడియాతో మాట్లాకపోయినా...మీడియా ప్రతినిధులతో వాళ్లు మాట్లాడుతున్న మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. నాయిని నర్సింహారెడ్డి, రాజయ్య వంటి నేతలు ఈ రకంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. దీనిపై వెంటనే స్పందించి వారితో మాట్లాడిన టీఆర్ఎస్ నాయకత్వం... ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గట్టిగానే చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మీడియాతో మాట్లాడే సమయంతో పాటు వారితో పిచ్చాపాటిగా మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... మీడియాతో చిట్‌చాట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సాధ్యమైతే ఇలాంటి చిట్‌చాట్‌లకు దూరంగా ఉండాలని ఆయన పలువురు నేతలకు సూచించినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకపై ఇలాంటి చిట్‌చాట్‌ల కారణంగా పార్టీకి ఇబ్బందులు కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని కేటీఆర్ స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీవీ ఛానల్స్‌లో చర్చలకు టీఆర్ఎస్ నేతలు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీఆర్ఎస్ నాయకత్వం... చిట్‌చాట్‌ల విషయంలోనూ సీరియస్‌గానే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.


First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...