అన్న చాలా అందంగా ఉన్నావ్... కేటీఆర్‌కు సరదా ట్వీట్

ఫేస్ యాప్‌లో కేటీఆర్ ఫోటోను ఎడిట్ చేసి... గడ్డం మీసాలతో కేటీఆర్ ఫోటోను పోస్టు చేశాడు.

news18-telugu
Updated: July 21, 2019, 2:32 PM IST
అన్న చాలా అందంగా ఉన్నావ్... కేటీఆర్‌కు సరదా ట్వీట్
ఫేస్ యాప్‌లో ఎడిట్ చేసిన కేటీఆర్ ఫోటో
  • Share this:
సోషల్ మీడియాలో ఎప్పుడ చురుకుగా ఉండే ప్రముఖ రాజకీయ నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్‌లో ఆయన ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లు పెట్టిన పోస్టులకు స్పందిస్తూ ఉంటారు. సాయం అడిగిన వారికి భరోసా ఇస్తారు. అలాంటి కేటీఆర్‌కు ఓ అభిమాని సరదా ట్వీట్ చేశారు. ఫేస్ యాప్‌లో కేటీఆర్ ఫోటోను ఎడిట్ చేసి... గడ్డం మీసాలతో కేటీఆర్ ఫోటోను పోస్టు చేశాడు.

‘అన్నా..గడ్డం, మీసాలతో మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఆ నెటిజన్ శనివారం కేటీఆర్‌కు సరదాగా ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ఒక సమావేశంలో ప్రసంగిస్తున్న ఫోటోకు ఫేస్‌యాప్‌ సాయంతో గడ్డం మీసాలు పెట్టి ట్వీట్‌కు జత చేశారు. దీంతో ఆ అభిమాని చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందించాడు.  అతనికి ట్విట్టర్‌లోనే కృతజ్ఞతలు తెలిపారు. ‘నాట్ బ్యాడ్... ఇలా కూడా బాగానే ఉన్నానే’ అంటూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కేటీఆర్ ట్వీట్లతో పాటు... గడ్డం మీసాలతో ఉన్న ఫోటో కూడా వైరల్ అవుతోంది.First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>