ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రామ ఇంచార్జ్ శ్రావణితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

news18-telugu
Updated: September 25, 2020, 11:44 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రామ ఇంచార్జ్ శ్రావణితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్
కేటీఆర్(PHOTO-TWITTER/TRS Party)
  • Share this:
తెలంగాణలో పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం ఒకటి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, గ్రామాల వారీగా ఓటరు నమోదు ఇంచార్జ్‌లు పాల్గొన్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఆరా తీశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్.. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం రుస్తాపురంలో టీఆర్ఎస్ తరఫున గ్రాడ్యుయేట్ల ఓటరు నమోదు ఇంచార్జ్‌గా పనిచేస్తున్న మెగిరెడ్డి శ్రావణితో ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ‌ఎంత మంది ఓటర్లు ఉన్నారు అని కేటీఆర్ శ్రావణి ని అడిగారు. అందుకు శ్రావణి 40 నుంచి 50 మంది ఉంటారు సార్ అని సమాధానం చెప్పింది. అలాగే యువతను ఈ ఎన్నికలకు ఎలా మోటివేట్ చేస్తున్నారని కేటీఆర్ అడగ్గా.. శ్రావణి చెప్పిన సమాధానంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక, కేటీఆర్ అడిగిన మరో ప్రశ్నకు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివ‌ద్దిని చూసి తనవంతు సహకారంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా పనిచేయాలని ముందుకు వచ్చానని శ్రావణి చెప్పింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. "థాంక్యూ బేటా.. థాంక్యూ వెరీమచ్‌. ఇదే స్ఫూర్తిని పది మందిలో నింపు" అని అన్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 25, 2020, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading