హుజూర్‌నగర్‌ మాదే... కేటీఆర్ ధీమా... మెజార్టీపై...

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 21, 2019, 5:30 PM IST
హుజూర్‌నగర్‌ మాదే... కేటీఆర్ ధీమా... మెజార్టీపై...
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన కొద్ది నిమిషాలకే ట్వీట్ ద్వారా స్పందించిన కేటీఆర్... హుజూర్ నగర్‌లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం మేరకు... తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత కీలకమైన అంశాలపై స్పందించడం తగ్గించిన కేటీఆర్... హుజూర్ నగర్‌లో గెలుపుపై ధీమా వ్యక్తం చేయడంతో పార్టీ గెలుపుపై టీఆర్ఎస్‌లో నమ్మకం పెరిగింది. 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైన హుజూర్ నగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 24న జరగనుంది.






Published by: Kishore Akkaladevi
First published: October 21, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading