కేటీఆర్, హరీశ్ రావులకు ఏ శాఖలు... సీఎం కేసీఆర్ సమాలోచనలు

మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంతో పాటు కేటీఆర్, హరీశ్ రావులకు ఏ శాఖలు దక్కబోతున్నాయనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: September 8, 2019, 1:02 PM IST
కేటీఆర్, హరీశ్ రావులకు ఏ శాఖలు... సీఎం కేసీఆర్ సమాలోచనలు
కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్
  • Share this:
మరికొద్ది గంటల్లోనే కేబినెట్‌ను విస్తరించనున్న సీఎం కేసీఆర్... కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మరో నలుగురిని కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప... ఈ జాబితాలో మార్పు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంతో పాటు కేటీఆర్, హరీశ్ రావులకు ఏ శాఖలు దక్కబోతున్నాయనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కీలక శాఖలు సీఎం దగ్గరే ఉన్నాయి. గతంలో కేటీఆర్, హరీశ్ రావు నిర్వహించిన శాఖల్లో ఎక్కువశాతం సీఎం కేసీఆర్ దగ్గరే ఉండటంతో... వీరిద్దరికి వాళ్లు గతంలో నిర్వహించిన శాఖలనే కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.

ఐటీతో పాటు పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు కేటీఆర్‌కు దక్కొచ్చని తెలుస్తోంది. హరీశ్ రావుకు సాగునీటి పారుదల లేదా కీలకమైన ఆర్థికశాఖ దక్కొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శాఖ కేటాయింపు అంశంపై కేటీఆర్, హరీశ్ రావుతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం తరువాత సీఎం కేసీఆర్‌తో కలిసి కేటీఆర్, హరీశ్ రావు ప్రగతి భవన్‌కు చేరుకుని దీనిపైనే చర్చిస్తున్నారని సమాచారం. కేబినెట్ విస్తరణ అనంతరం కేబినెట్ సమావేశం ఉండటం... రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండటంతో... శాఖల కేటాయింపు కూడా వెంటనే చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading