Anandaiah New Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. ఆనందయ్య సంచలనం.. వైసీపీపై తీవ్ర విమర్శలు

బొనిగి ఆనందయ్య (ఫైల్)

Anandaiah new party: సభా వేదికగా జగన్ ప్రభుత్వంపై కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన ఆయుర్వేద మందుకు అనుమతి ఇవ్వకుండా వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.

  • Share this:
    కృష్ణపట్నం ఆనందయ్య (Krishnapatnam Anandaiah).. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కరోనాసెకండ్ వేవ్ (Corona second wave) సమయంలో ఈయన చాలా పాపులర్ అయ్యారు. కరోనాకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా మార్మోగింది. కరోనాకు అప్పటికే వ్యాక్సిన్ వచ్చినా.. ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉన్నా.. వాటిని కాదని.. లక్షలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి పరుగులు పెట్టారు. అక్కడ ఆనందయ్య ఇచ్చే కరోనా ఆయుర్వేద మందు కోసం ఎగబడ్డారు. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాతే తమకు కరోనా తగ్గిపోయిందని.. విషమ పరిస్థితుల నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లామని చాలా మంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆనందయ్య మందు గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మందు తీసుకున్నారు. అంతేకాదు ఉచితంగానే మందును పంపిణీ చేయడంతో అసలైన హీరోగా అభివర్ణించారు. ఐతే అదే ఆనందయ్య ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏపీలో కొత్త పార్టీని ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు.

    మంగళవారం రాజమండ్రిలో అఖిల భారత యాదవ మహాసభ (Akhil Bharatiy Yadav Mahasabha) 13 జిల్లాల సమైఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆనందయ్య.. సభా వేదికగా తన కొత్త పార్టీ గురించి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే యాదవుల రాజకీయ పార్టీని(New Political Party) ప్రారంభిస్తానని ప్రకటించారు. మిగిలిన బీసీ కులాలను కలుపుకొని ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేస్తామని ఆనందయ్య వెల్లడించారు. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని ముందకు వెళ్తామని ఆయన చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు ఆనందయ్య.

    Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు..

    ఈ సమావేశం వేదికగా జగన్ (YS Jagan) ప్రభుత్వంపై కృష్ణపట్నం ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన ఆయుర్వేద మందుకు అనుమతి ఇవ్వకుండా వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసిందని, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించిందని విమర్శించారు ఆనందయ్య. కానీ స్థానికుల ఐక్యతతో తనను అరెస్ట్ చేయలేదని ఆయన అన్నారు. కృష్ణపట్నం గ్రామస్తుల మద్దతు వల్లే తాను నిలబడగలిగానని ఆనందయ్య చెప్పారు. ప్రజల్లో తనకున్న ఆదరణ చూసి పోలీసులు కూడా భయపడ్డారని ఆయన తెలిపారు.

    Vijayawada Railway Station: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30 నుంచి భారీ ఊరట

    ఎంతోమంది కరోనా రోగులకు ఉచితంగా మందుని అందించానని ఆనందయ్య చెప్పారు. తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయుర్వేదం నేర్చుకుని,  కరోనాకి మందును కనిపెట్టినట్లు తెలిపారు. కానీ ఆ కరోనా మందును ఆపేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని ఈ సందర్భంగా ఆనందయ్య ఆరోపించారు. లక్షలు మంది నమ్మకాన్ని చెడగొట్టేలా ప్రయత్నాలు జరిగాయని తీవ్ర విమర్శలు చేశారు. ఐతే ఆయుర్వేద మందుతో ఎంతో ఫేమస్ అయిన ఆనందయ్య.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published: