• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • KRISHNA DISTRICT PEDANA MLA JOGI RAMESH THREATENS VOTERS TO CUT WELFARE SCHEMES IF ANYONE FILED NOMINATIONS AGAINST YSRCP SUPPORTERS IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: మాపై పోటీ చేస్తే పథకాలు కట్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

AP Panchayat Elections: మాపై పోటీ చేస్తే పథకాలు కట్.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఏకగ్రీవాల కోసం బెదిరింపుల పర్వాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఏకగ్రీవాల కోసం బెదిరింపుల పర్వాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు నామినేషన్లు వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించిన ఘటన మరువక ముందే మరో వైసీపీ ఎమ్మెలే అలాంటి వ్యాఖ్యలే చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తే పథకాలు కట్ చేస్తామంటూ ప్రజలను హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా పెడన రూరల్ మండలంలోని మునిపెడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసిన స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్.. బహిరంగసభలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    వైఎస్ఆర్సీపీకి ఎవరైనా నామినేషన్లు వేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ సభలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ‘ఎవరైనా వైఎస్ఆర్సీపీ కాకుండా.. వేరే పార్టీ తరపున వార్డు మెంబర్ గా నిలబడితే ఊరుకునే ప్రసస్తే లేదన్నారు జోగి రమేష్. జగనన్న ఇస్తున్న పథకాలు తీసుకుంటూ వేరే పార్టీల్లో పోటీ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని.., పెన్షన్, కాపునేస్తం అమ్మఒడి, ప్రతి పథకాన్నీ కూడా కట్ చేసిపారేస్తామని అందులో మొహమాటం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.

    మునిపెడ గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో కొందరు యువకులు పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేయడానికే ఎమ్మెల్యే జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మునిపెడ గ్రామం పక్కనే ఉన్న మరో గ్రామ పంచాయతీని ఓ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవం చేయాలని భావించినా.. బెదిరింపులకు గురిచేసి పోటీకి నిలబెట్టినట్లు స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.

    పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పథకాల పేరుతో ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గ్రామాల్లో రాజకీయ తగాదాలు లేకుండా ఏకగ్రీవాలు చేయడం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు