కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలి.. టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌ లో ఇది చీకటి రోజు అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.

news18-telugu
Updated: July 31, 2020, 6:19 PM IST
కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలి.. టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా ఆమోదముద్ర వేశారు. దీనిపై టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు అని ఆయన అన్నారు. అలాగే, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు చీకటి రోజు. హైకోర్టు, సుప్రీం కోర్టు, సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్న రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తును నాశనం చేయడమే. అసలు సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్న బిల్లుపై నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. అమరావతిని నాశనం చేయాలి అనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తాం.’ అని అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 31, 2020, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading