నా అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య.. కాకాణిపై కోటంరెడ్డి అనుమానం

తనపై విచారణ పక్షపాతంగా జరిగిందని సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోటంరెడ్డి విన్నవించారు. ఈ కేసుపై తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. కాకాణి అనుచరుల మీద కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 7, 2019, 3:22 PM IST
నా అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య.. కాకాణిపై కోటంరెడ్డి అనుమానం
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • Share this:
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఎంపీడీఓ సరళపై దాడి కేసులో అరెస్టై.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. తాను ఎంపీడీఓ ఇంటిపై దాడి చేస్తే.. ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి కానీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి ఇంటికి ఎందుకు వెళ్లిందని కోటంరెడ్డి ప్రశ్నించారు. జిల్లా ఎస్పీకి, తనకు వ్యక్తిగత విబేధాలు ఉన్నాయని, ఈ కేసును అడ్డుపెట్టుకుని ఎస్పీ తన మీద కక్షతీర్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎంపిడివో సరళ పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు కాకాణి అనుచరుడు ప్రదీప్ రెడ్డి పోలీసులను దారుణంగా మాట్లాడారని అన్నారు.

మా బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో లే ఔట్ వేసాడు. ఆ లే ఔట్ కు నుడా, రేరా అనుమతులు ఖచ్చితంగా ఉన్నాయి. లే ఔట్ కు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా ఎంపిడిఓని అడుగుతున్నా పట్టించుకోలేదు. ఆవిడకి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగితే మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దని చెప్పాడు అని సమాధానం చెప్పింది. నేను మా బావ అయిన ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేసి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగా. నీకు తెలీదు శ్రీధరా, ఇప్పుడు కుదరదు అన్నాడు, అంతటితో నేను సైలెంట్ ఐపోయా.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే


తనపై విచారణ పక్షపాతంగా జరిగిందని సీఎం జగన్ మోహన్ రెడ్డికి కోటంరెడ్డి విన్నవించారు. ఈ కేసుపై తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. కాకాణి అనుచరుల మీద కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల తాను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు వసూలు చేయాలంటూ నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలకు వెళ్ళానని, వాళ్లపైనా తనకు అనుమానాలు ఉన్నాయని కోటంరెడ్డి చెప్పారు. ఎంపిడిఓ ఇచ్చిన ఫిర్యాదులో నిజాలు ఉన్నాయని నిగ్గు తేలిస్తే తనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. షోకాజ్ నోటీసులు కూడా అక్కర్లేదని, నేరుగా శాశ్వతంగా బహిష్కరించొచ్చని సూచించారు. ఉద్యోగులు కూడా తనను బహిరంగ విచారణకు పిలవాలని, ఎంపీడీఓ సరళ ఇంటిపై దాడి చేసినట్టు నిరూపిస్తే ఆమె కళ్లాు పట్టుకుని క్షమాపణ చెబుతానని కోటంరెడ్డి అన్నారు.

అంతరిక్షం నుంచి భూమికి దిగొచ్చిన వ్యోమగాములు..
Published by: Ashok Kumar Bonepalli
First published: October 7, 2019, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading